Begin typing your search above and press return to search.

లక్ష్మీదేవి డ్యాన్స్ చెయ్యదు విమలా

By:  Tupaki Desk   |   24 Aug 2016 5:18 AM GMT
లక్ష్మీదేవి డ్యాన్స్ చెయ్యదు విమలా
X
హాట్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న విమలా రామన్.. ఇప్పుడు ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తోంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో.. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో లక్ష్మీదేవిగా నటిస్తోంది విమలా రామన్.

ఈ పాత్ర చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ అయిపోయిందట ఈ భామ. 'చిన్నప్పటి నుంచి దేవుళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఓ దేవత రోల్ వస్తే వదులుకుంటానా? నాగార్జున సినిమాలో అందులోనూ రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసే అవకాశం అందరికీ రాదు' అంటోంది విమలా రామన్. అయితే.. చిన్నప్పటి నుంచి తాను నేర్చుకున్న భరత నాట్యంలో తన ప్రతిభను ఈ సినిమాలో ఉపయోగించేద్దామని అనుకుని.. దర్శకుడిని అడిగిందట. 'నువ్వు డ్యాన్స్ చెయ్యడం కుదరదు.. ఎందుకంటే.. లక్ష్మీదేవి ఎప్పుడూ డ్యాన్స్ చేసిన దాఖలాలు లేవు' అని చెప్పారట దర్శకేంద్రుడు.

అలాగని ఈ పాప ఏం డిజప్పాయింట్ కాలేదు. ఎప్పుడైనా శివుడి సినిమాలో చేసే ఛాన్స్ వచ్చినపుడు తన ట్యాలెంట్ చూపించేస్తానంటోంది. ఇంతకీ.. ఓం నమో వెంకటేశాయ చిత్రం అంగీకరించే వరకూ.. హథీరాం బాబా ఎవరో తనకు తెలీదని.. ఈ మూవీ స్క్రిప్ట్ చదివాకే ఎంతటి భక్తుడో తెలిసిందని చెప్పింది విమలా రామన్.