Begin typing your search above and press return to search.

బాహుబలి రేంజ్ లో మణిరత్నం సినిమా

By:  Tupaki Desk   |   10 Dec 2018 10:11 AM GMT
బాహుబలి రేంజ్ లో మణిరత్నం సినిమా
X
ఇటీవలే వచ్చిన నవాబ్ తో తనలో టెక్నీషియన్ ని ప్రూవ్ చేసుకున్న మణిరత్నం తెలుగులో దానికి చేదు ఫలితం అందుకున్నప్పటికి తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకునే గట్టి సబ్జెక్టు కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. కాకపోతే రెగ్యులర్ గా వెళ్ళే కమర్షియల్ ఫార్మట్ లో కాకుండా ఈసారి కాస్త వినూత్నంగా హిస్టారికల్ జానర్ వైపు వెళ్తున్నట్టు సమాచారం.

తమిళనాట కల్కి కృష్ణమూర్తి సుప్రసిద్ధ రచయిత. ఆయన రాసిన పోన్నియన్ సెల్వన్ అనే చారిత్రాత్మక నవల ఐదు భాగాల్లో ఉంటుంది. మొత్తం రెండున్నర వేల పేజీలలో ఉండే ఈ నవల అమితమైన ఆదరణ చూరగొంది. ఇది చాలా పాత సాహిత్యం. మొదటి తరానికి చెందిన రాజ రాజ చోళన్ కథే ఈ పోన్నియన్ సెల్వన్. గతంలో ఏంజిఆర్ లాంటి స్టార్లు దీన్ని తీసేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు.

ఇన్నాళ్ళకు మణిరత్నంకు ఇది రూపొందించే ఛాన్స్ దొరికిందట. చియాన్ విక్రంతో దీన్ని సౌత్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు సమాచారం. షూటింగ్ మొదలుకావడానికి కొంత సమయం పడుతుంది కాని ఆలోపు పక్కా స్క్రిప్ట్ తో ప్రీ ప్రొడక్షన్ రెడీ చేస్తున్నట్టు తెలిసింది. హీరొయిన్ టెక్నికల్ టీం డీటెయిల్స్ తెలియడానికి ఇంకా టైం ఉంది. మణిరత్నం విక్రం కాంబోలో గతంలో విలన్ వచ్చింది. ఐశ్వర్య రాయ్ కీలక పాత్ర పోషించిన ఆ మూవీ డిజాస్టర్. కాని విక్రం పెర్ఫార్మన్స్ కి మంచి పేరు వచ్చింది. ఈసారి అలా జరగకుండా బాహుబలి రేంజ్ లో ఈ పోన్నియన్ సెల్వన్ ని తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది.