Begin typing your search above and press return to search.

ఆ ఫ్లాప్ సినిమా ఇప్పుడెందుకు?

By:  Tupaki Desk   |   26 Sep 2017 1:22 PM GMT
ఆ ఫ్లాప్ సినిమా ఇప్పుడెందుకు?
X
డబ్బింగ్ సినిమాల దాడి మన మీద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా తమిళ్ నుంచి అయితే ఈ తాకిడి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. తెలుగు.. తమిళ్ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన సినిమాల సంగతి పక్కన పెడితే.. సహజంగా హిట్ మూవీస్ ను మన మీదకు వదులుతూ ఉంటారు మేకర్స్. కానీ డబ్బింగ్ సినిమాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన బాపతు చిత్రాలు మన మీదకు దాడిచేయడం అరుదుగా జరిగే విషయం.

విక్రమ్- సమంత జంటగా నటించిన సినిమా 10-ఎన్రాదుకుళ్ల. ఈ సినిమా ఇప్పుడొచ్చిందేమీ కాదు. రెండేళ్ల క్రితం అక్కడ దీపావళికి రిలీజ్ అయి సూపర్ ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడా మూవీని 10 పేరుతో తెలుగులోకి తెచ్చేస్తున్నారు. ఈ మూవీలో కోలీవుడ్ లో ఫ్లాప్ కాగా.. రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఎవరికీ నచ్చలేదు. పైగా ఈ మూవీలో సమంత డ్యుయల్ రోల్ చేస్తుంది. వీటిలో ఒకటి విలన్ రోల్ కూడా. మరి ఇప్పుడు ఆ సినిమాను 10 అనే టైటిల్ పై తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ మూవీ అక్కడ సూపర్ హట్ అని ప్రచారం చేసేసి మరీ విడుదల చేస్తుండడం విశేషం.

నిజానికి మన దగ్గర విక్రమ్ సినిమాలు ఆడడం మానేసి చాలా కాలమే అయింది. అ..ఆ తర్వాత అమ్మడి సినిమా ఒక్కటి కూడా రాలేదు. పైగా ఈ మూవీకి నిర్మాత మురుగదాస్. స్పైడర్ పుణ్యమా అని మురుగదాస్ పేరు తెగ నానుతోంది. సో.. అన్ని సిట్యుయేషన్స్ ను బేస్ చేసుకుని.. మన జనాల మీదకు ఓ ఫ్లాప్ సినిమా వదిలేస్తున్నారు. మరి ఈ సినిమా మన జనాలను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. దీపావళి కానుకగా 10 రిలీజ్ కానుందట.