ఫోటో స్టొరీ: ధృవ్ గారి వస్తాదు అవతారం!

Tue Jan 15 2019 13:45:28 GMT+0530 (IST)

తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ప్రస్తుతం తన డెబ్యూ సినిమా 'వర్మ' లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  తెలుగులో సంచలనం సృష్టించిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు ఈ సినిమాకు రీమేక్ తెరకెక్కుతోంది.  బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రలో ధృవ్ కనిపిస్తాడు.  'వర్మ' ఫస్ట్ లుక్.. టీజర్లకు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చినా .. ట్రైలర్ కు మాత్రం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.ఈ హంగామాతో సంబంధం లేకుండా ధృవ్ మాత్రం తన సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు.  రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశాడు.  దానికి "మీలోపల ఉన్నవాటిని మార్చనంతవరకూ మీకు వెలుపల జరిగేవాటిని మార్చలేరు" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.   ఇక ఫోటోలో ఫుల్ గా బాడీ బిల్డ్ అప్ చేసి తన కండలు హైలైట్ అయ్యేలా సోఫాలో కూర్చున్నాడు.  లాంగ్ హెయిర్.. దానికి ఒక హెయిర్ క్లిప్ కూడా పెట్టుకోవడంతో చియాన్ విక్రమ్ ను గుర్తుతెస్తున్నాడు.  రీమేక్.. విజయ్ దేవరకొండతో పోలికలు కాసేపు పక్కనబెడితే.. జూనియర్ చియాన్ బాబు బాడీ బిల్డింగ్ మాత్రం అదిరిపోయింది.

సినిమాలో తన పాత్రను బట్టి విక్రమ్ తన బాడీని మలుచుకుంటాడు.  ఇప్పటికే చాలాసార్లు అలా సన్నబడడం.. లావు కావడం చేశాడు.  ఇప్పుడు సన్నాఫ్ చియాన్ కూడా నాన్నగారి బాటలో మజిల్ మ్యాన్ లా తయారయ్యాడు.  బాడీ బిల్డింగ్ బాగుందిగానీ నటన ఎలా ఉందో తెలియాలంటే మాత్రం 'వర్మ' ఆగమనం కోసం వేచి చూడాల్సిందే.