Begin typing your search above and press return to search.

ఆ రైటర్ అలా డైరక్టర్ అయ్యాడు

By:  Tupaki Desk   |   20 Jan 2018 6:30 PM GMT
ఆ రైటర్ అలా డైరక్టర్ అయ్యాడు
X
చాలా మంది యువతరం డైరెక్టర్ అవ్వాలని కలలు కని ఇండస్ట్రీకి వస్తారు. కాని ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గానో, టెక్నిషియన్గానో వారి కెరీర్ ను మొదలుపెడతారు. అలా అసోసియేట్ డైరెక్టర్ గా మొదలైన తన సినీజీవితం లో రైటర్ గా మారి ఇపుడు డైరెక్టర్ గా మారిన ఒక టాలెంటెడ్ వ్యక్తే విక్రమ్ సిరికొండ.

విక్రమ్ సిరికొండ 2003 లో చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ తర్వాత సాంబ - బన్నీ - స్టైల్ సినిమాలకు కూడా ఆయా దర్శకుల కింద పని చేసాడు. 2009 లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో స్క్రీన్ రైటర్ గా మారాడు. "డైరెక్టర్ డాలీ నాకు మంచి స్నేహితుడు. అతనే నన్ను ఒక కథ రాయమన్నాడు." అని అంటున్న విక్రమ్ సిరికొండ తర్వాత మిరపకాయ మరియు రేసుగుర్రం వంటి సినిమాలకి కూడా స్క్రిప్ట్ రాసాడు. అన్నీ హిట్లు అయ్యాయి అన్నది తెల్సిన విషయమే.

మిరపకాయ్ సినిమా చేస్తున్నప్పుడే రవితేజ ఇతనిని డైరెక్టర్ గా చేయమని చెప్పాడట. తన సహకారంతోనే ఇపుడు రవితేజ నటిస్తున్న 'టచ్ చేసి చూడు' సినిమాకి దర్శకవత్వం వహిస్తున్నాడు విక్రమ్. వక్కంతం వంశీ స్క్రిప్ట్ రాసినప్పటికి విక్రమ్ తాను కొన్ని మార్పులు చేస్తానని కానీ క్రెడిట్ మాత్రం వంశీకి ఇస్తానని అడగగా నిర్మాతలు కూడా సరేనన్నారట.

డైరెక్టర్ గా అవ్వాలని ఇండిస్ట్రీ కి వచ్చానని చెప్తున్న విక్రమ్ "నేను ఒక నెల డి.ఆర్.డి.ఓ లో పనిచేశాను కానీ సినిమా అంటే ఉన్న ఇష్టంతో టాలీవుడ్లో కి అడుగుపెట్టాను. మాములుగా ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్ కో లేదా యాక్టర్ లకు క్రెడిట్ ఇస్తారు కానీ రైటర్లకి ఇవ్వరు. అందుకే నాకు మొదటినుండి డైరెక్టర్ అవ్వాలనే ఉండేది." అని తన మనసులోని బయటపెట్టాడు డైరెక్టర్ సిరికొండ.