Begin typing your search above and press return to search.

విక్రమ్ డైరక్షన్లో సినిమా చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:34 PM GMT
విక్రమ్ డైరక్షన్లో సినిమా చేస్తున్నాడా?
X
తన ప్రతి సినిమాకి మార్కెట్ రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస హిట్స్ తో నందమూరి అభిమానులకు సంతోషాన్ని ఇస్తున్నాడు. రీసెంట్ గా జై లవకుశ సినిమాతో మంచి కలక్షన్లు అందుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే నిర్మాతకి బయ్యర్స్ కి కూడా మంచి లాభాలనే అందించింది.

అయితే తారక్ నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని ప్రతి ఒక్కరు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఉంటుందని ఇప్పటికే తారక్ చాలా సార్లు చెప్పాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ - పవన కళ్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అయిపోగానే ఎన్టీఆర్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళతాడు. అయితే ఆ సినిమా స్టార్ట్ కాకముందే మరో కథని అడ్వాన్స్ గా ఒకే చేశాడట తారక్. రీసెంట్ గా మనం దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విక్రమ్ - అఖిల్ హలో సినిమాతో బిజీగా ఉన్నాడు డిసెంబర్ లో ఆ సినిమా రిలీజ్ అవ్వనుంది. అయితే విక్రమ్ అల్లు అర్జున్ కి కూడా ఒక కథను చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ నా పేరు సూర్య అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత బన్నీ - విక్రమ్ తోనే చేయనున్నాడట. ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యే సరికి ఒక సంవత్సరం పడుతుంది. ఇక ఎన్టీఆర్ తో విక్రమ్ సినిమాను తెరకెక్కించాలంటే మరో రెండేళ్లు పట్టవచ్చని తెలుస్తోంది.