Begin typing your search above and press return to search.

ప్రియ అంటే అంతిష్టమా బాసూ

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:58 PM GMT
ప్రియ అంటే అంతిష్టమా బాసూ
X
ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని హిట్ సినిమాలు తీశాక.. ఆ సినిమాలో ఉన్న నటీనటులను టెక్నీషియన్లు మళ్ళీ మళ్లీ వినియోగిస్తుంటారు. ఎందుకంటే వారున్న సినిమా హిట్టవుతుంది కాబట్టి.. ఈ కొత్త సినిమాకు కూడా అదే సక్సెస్ రిపీటవుతుంది అనే చిన్న ఆశ. ఇదొక సెంటిమెంట్ అనే చెప్పుకోవాలి. అలాగే హీరో హీరోయిన్ల పేర్లు కూడా మనోళ్ళకు సెంటిమెంట్లేనండోయ్.

ఉదాహరణకు మనం విక్రమ్ కె కుమార్ తీస్తున్న సినిమాలనే తీసుకుందాం. మనోడు అప్పట్లో శ్రీయతో తీసిన 'ఇష్టం' సినిమాలో హీరోయిన్ పేరు నేహా అని పెట్టాడు. ఆ సినిమా డిజాష్టర్ అయ్యింది. ఆ తరువాత కొన్నాళ్ళకు తీసిన '13బి' సినిమాలో నీతూ చంద్ర పేరు ప్రియ. ఆ సినిమా సూపర్ హిట్. అందుకే అప్పటినుండి తన ప్రతీ సినిమాలోనూ ప్రియ అనే పేరునే వాడుతున్నాడు. ఇష్క్ మరియు 24 సినిమాలలో నిత్యా మీనన్.. మనం సినిమాలో సమంత.. ఈ ప్రియ పేరుతోనే తెరమీద తళుక్కుమన్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న హలో సినిమాలో కూడా అదే రిపీట్ అయ్యింది.

హలో సినిమాలో తను చేసిన ప్రియ అనే పాత్ర గురించి మాట్లాడుతూ.. ఎంతోమంది హీరోయిన్లు ఈయన తీసే ప్రియగా మారాలని ఎదరుచూస్తున్నప్పుడు తనకు ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ.. అని కొత్తమ్మాయ్ కళ్యాణి ప్రియదర్శన్ చెప్పడంతో.. విక్రమ్ ఇలా 'ప్రియ' సెంటిమెంట్ మళ్లీ వాడాడని అర్దమవుతోంది. అయితే ఈ ప్రియ కేవలం సెంటిమెంటేనా దీని వెనుక ఇంకేమైనా కథ ఉందా బాసూ? ఒకవేళ అడుగుదాం అంటే మనోడు ఎవ్వరికీ ఇంటర్యూలు ఇవ్వడుగా.. కాబట్టి అడగలేం.