Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: లవ్ కోసం అఖిల్ వేట

By:  Tupaki Desk   |   16 Aug 2016 1:47 AM GMT
ట్రైలర్ టాక్: లవ్ కోసం అఖిల్ వేట
X
చియాన్ విక్రమ్ తన స్థాయికి సక్సెస్ నే కాదు.. అసలు హిట్ కొట్టే సంవత్సరాలు గడిచిపోతోంది. ఇప్పుడు ఇరుమగన్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగులో ఇంకొక్కడు అనే టైటిల్ పై ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

విలన్ పేరు లవ్. ఇతన్ని ఎవరూ చూడలేదు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ చేసేస్తూ ఉంటాడు. ఈ లవ్ ను పట్టుకోవడానికి 'రా' ఆఫీసర్ అఖిల్ కి కేసు అప్పగిస్తారు. విలన్ లవ్.. హీరో అఖిల్.. ఈ రెండు పాత్రలను విక్రమ్ చేసేశాడు. లవ్ ను అఖిల్ ఎలా పట్టుకుంటాడన్నదే సినిమా స్టోరీ. చెప్పుకోవడానికి సింపుల్ గానే ఉన్నా.. మలేషియా బేస్డ్ గా తీసుకుని అండర్ వరల్డ్ కార్యకలాపాలను.. అంతకు మించి హీరో విలన్ గేమ్ ను బాగానే చూపించారు. హీరో గెటప్ లో గెడ్డంతో డిఫరెంట్ లుక్ చూపించిన విక్రమ్.. విలన్ వేషంలో అయితే తన స్టైల్ లో రెచ్చిపోయాడు. ఇది హిజ్రా రోల్ కావడం మరో హైలైట్. ఇక ఇలాంటి విభిన్నమైన కేరక్టర్లను చేయడంలో ఆరితేరిన విక్రమ్.. ఇరగదీసేశాడనే చెప్పాలి.

విలన్ రోల్ పరిచయమయ్యాక.. హీరో పాత్రను పట్టించుకోలేనంత స్థాయిలో లవ్ రోల్ లో జీవించేశాడు విక్రమ్. నువ్వు రాజు.. నేను రాణి.. అంటూ ట్రైలర్ చివర్లో చూపించిన కులుకులు.. చియాన్ కు మాత్రమే సాధ్యం. ఇక విక్రమ్ తో పాటు కేసు ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో నిత్యామీనన్ నటిస్తే.. హీరోయిన్ నయనతార గ్లామర్ డోస్ కురిపించి చంపేసింది. మొత్తం మీద ట్రైలర్ తో ఇంకొక్కడు మూవీ ఇంకో మెట్టెక్కేసింది.