Begin typing your search above and press return to search.

మా పొట్ట కొట్టొద్దు ప్లీజ్ - హీరో విజయ్

By:  Tupaki Desk   |   4 Aug 2015 7:16 AM GMT
మా పొట్ట కొట్టొద్దు ప్లీజ్ - హీరో విజయ్
X
అత్తారింటికి దారేది, బాహుబలి .. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అనధికారిక వీడియోలు నెట్‌ లో హల్‌ చల్‌ చేసి పెను ప్రకంపనలు సృష్టించాయి. పైరసీ లో సగం సినిమా రిలీజైపోవడంతో అత్తారిల్లు నిర్మాతకు ఏకంగా గుండెపోటు వచ్చింది. భారతదేశంలోనే ప్రతిష్ఠాత్మక సినిమాని తెరకెక్కిస్తున్నానని రాజమౌళి సగర్వంగా ఫీలవుతున్న వేళ సైలెంటుగా ఓ టెక్కీ బాహుబలి వీడియోని నెట్‌ లోకి రిలీజ్‌ చేసేశాడు. జక్కన్న ఒక్కసారిగా భయంతో ఒణికిపోయాడు.

ఈ రెండు సన్నివేశాలు ఎన్నో గుణపాఠాల్ని నేర్పించాయి. అందుకే ఇటీవలి కాలంలో సినిమా రిలీజ్‌ టైమ్‌ లో పైరసీ పై నిర్మాతలు యుద్ధం ప్రకటిస్తున్నారు. ఆన్‌ లైన్‌ లో పైరేట్‌ లను వేటాడుతూనే, పైరసీ డీవీడీ లు విక్రయిస్తున్న వారిని నిర్ధయగా జైళ్లలో వేస్తున్నారు. ఇప్పుడు తమిళ హీరో విజయ్‌ వంతు వచ్చింది. అతడు నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం పులి త్వరలోనే రిలీజ్‌ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా పైరసీ గురించి మాట్లాడుతూ విజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'పైరసీ ని ఆన్‌ లైన్‌ లో వ్యాపింపజేసి మా పొట్ట కొట్టొద్దు. సుఖ ప్రసవానికి ముందే గర్భం కోసేయడం కిందే లెక్క' అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

చింబుదేవన్‌ దర్శకత్వంలో పులి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. బాహుబలిని మించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ ని చూపిస్తామని సవాల్‌ చేశారిప్పటికే. పులి ఆడియో వేడుకలో విజయ్‌ పైవిధంగా స్పందించాడు.