సైరా సినిమాలో.. సిపాయి పాత్రలో..

Wed Aug 23 2017 22:47:07 GMT+0530 (IST)

చాలామంది నటీనటులు ఇంకా అసలు తాము ''సైరా'' సినిమాలో ఉన్నదీ లేనిదీ కన్ఫామే చేయలేదు. నిన్న అఫీషియల్ గా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా గురించి న్యూస్ వచ్చినా కూడా.. ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు ఈ సినిమా గురించి మాట్లాడలేదు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న తమిళ హీరో మాత్రం.. తనకు చిరంజీవి గారి పక్కన చేయడం చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు.తమిళ సినిమాల్లో ఇప్పుడు పైపైకి దూసుకుపోతున్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా అందరూ చెప్పేది విజయ్ సేతుపతి గురించే. మనోడు ఎంచుకునే కథల దగ్గర నుండి తన పాత్ర తీరుతిన్నెల వరకు అన్నీ డిఫరెంట్ గానే ఉంటున్నాయి. అదిగో ఇప్పుడు విక్రమ్ వేద సినిమాతో మరో పెద్ద హిట్టును కొట్టేశాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి పక్కనే నటించాలనే ఆపర్ రాగానే.. అసలు క్యారక్టర్ ఏంటనేది అడగకుండానే ఓకే చేశాడట. ఈ సినిమాలో మనోడు బ్రిటీష్ వారి దగ్గర సిపాయిగా పనిచేసే ఒక భారతీయుడు పాత్రలో నటిస్తున్నాడని టాక్.

విజయ్ సేతుపతి పోషిస్తున్న పాత్ర తొలుత ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రను అస్సలు ఇష్టపడదట. కాని చివరకు మాత్రం ఉయ్యాలవాడ తపనను అర్ధంచేసుకుని.. ఆయనతో చేతులు కలిపి.. బ్రిటీష్ వారిపైకి దండయాత్రకు సిద్దపడుతుందట. చివరకు ఉయ్యాలవాడతో కలసి ప్రాణాలు అర్పిస్తుందట. అంతటి ఎమోషన్ ఉన్న పాత్ర కాబట్టే అడగ్గానే విజయ్ సేతుపతి ఓకే అనేశాడు. అది సంగతి.