ఫస్ట్ లుక్: రజనీ కోసం సేతుపతి ఇలా..

Wed Dec 05 2018 10:21:13 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం '2.0' థియేటర్లలో ఉండగానే తనే నెక్స్ట్ ఫిలిం 'పెట్టా' హంగామా మొదలైంది.  ఈమధ్యనే ఈ సినిమానుండి 'మరణ మాస్' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.  మొదటి సాంగ్ ఇన్స్టెంట్ గా హిట్ అయిపోయింది.  ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి 'జితు' అనే క్యారెక్టర్ లో కనిపిస్తాడని వెల్లడించారు. ఈ ఫస్ట్ లుక్ లో సేతుపతి ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు.  చేతిలో గన్ పట్టుకొని అదోరకంగా నవ్వుతున్నాడు.  పైన ఒక శాలువా.. మొహంపైన గాయాలు.. ఆ నవ్వు చూస్తుంటే మాత్రం విజయ్ ఒక గ్యాంగ్ స్టార్ పాత్ర పోషిస్తున్నాడనిపిస్తోంది.  ఇదే ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో రజనీకాంత్ స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు.  విజయ్ సేతుపతి మొదటి సారి రజనీ సినిమాలో నటిస్తుండంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులో ఆసక్తి వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాలో త్రిష.. సిమ్రాన్.. బాబీ సింహా.. మేఘా ఆకాష్.. నవజుద్ధీన్ సిద్దిఖీలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కళానిధిమారన్ నిర్మిస్తున్నాడు.  తమిళ వెర్షన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. తెలుగు 'పెట్టా' కొంచెం ఆలస్యంగా రిలీజ్ అవుతుందని సమాచారం.