Begin typing your search above and press return to search.

మెగా 'ఉప్పెన'తో జత కలిసిన రాజ పాండి

By:  Tupaki Desk   |   22 Aug 2019 5:02 AM GMT
మెగా ఉప్పెనతో జత కలిసిన రాజ పాండి
X
మెగా బ్రదర్స్‌ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా 'ఉప్పెన' టైటిల్‌ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రసుత్తం హైదరాబాద్‌ సారధి స్టూడియోలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి నటించబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. అయితే షూటింగ్‌ దాదాపుగా సగం పూర్తి కావచ్చినా కూడా విజయ్‌ సేతుపతి సెట్స్‌ కు రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.

ఇటీవల 'ఉప్పెన' నుండి విజయ్‌ సేతుపతి తప్పుకున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. పుకార్లన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టి ఎట్టకేలకు విజయ్‌ సేతుపతి 'ఉప్పెన' షూట్‌ లో పాల్గొన్నాడు. నిన్న 'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ వారు విజయ్‌ సేతుపతి చిత్రీకరణలో పాల్గొంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించి ఫొటోను పోస్ట్‌ చేయడం జరిగింది.

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో రాజ పాండి పాత్రలో నటించిన విజయ్‌ సేతుపతి ఆ చిత్రం విడుదల కాకుండానే మరో మెగా మూవీలో నటిస్తున్నాడు. తమిళంలో ఒక మంచి నటుడిగా స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న విజయ్‌ సేతుపతి తెలుగులో కూడా వరుసగా నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు.

'ఉప్పెన' చిత్రంలో విజయ్‌ సేతుపతి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచాం అందుతోంది. సారధి స్టూడియోలో వేసిన ఒక భారీ సెట్టింగ్‌ లో చిత్రంలోని కీలక నటీనటులు మరియు 500 మంది వరకు జూనియర్‌ ఆర్టిస్టులతో చిత్రీకరణ జరుపుతున్నారు. విజయ్‌ సేతుపతి రాకతో నిన్నంత సందడిగా చిత్రీకరణ సాగినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. త్వరలోనే ఉప్పెనకు సంబంధించిన వివరాలను రివీల్‌ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.