Begin typing your search above and press return to search.

సైరా ఓబయ్యకు వైష్ణవ్ తో ఏం పని ?

By:  Tupaki Desk   |   19 March 2019 6:40 AM GMT
సైరా ఓబయ్యకు వైష్ణవ్ తో ఏం పని ?
X
మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మిస్తున్న సినిమాలో ప్రత్యేక ఆకర్షణలు తోడవుతున్నాయి. సైరాలో ఓబయ్యగా కీలక పాత్ర చేస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా చేయబోతున్నట్టుగా మొన్నే వార్త వచ్చింది కానీ అంతకు మించి అనే స్థాయిలో హీరోతో సమానంగా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంగానే విజయ్ సేతుపతి ఇది చేయడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది.

ఇటీవలే విజయ్ సేతుపతిని కలిసిన యూనిట్ ఈ వార్తను అధికారికంగా త్వరలోనే ప్రకటించనుంది. ఈ విషయంగానే సాయి ధరమ్ తేజ్ కూడా ప్రత్యేకంగా కలిసి థాంక్స్ చెప్పాడట. విజయ్ సేతుపతి ఉన్నాడు అంటే వైష్ణవ్ తేజ్ మూవీకు ఆటోమేటిక్ గా తమిళ్ మార్కెట్ కు వెళ్ళిపోతుంది. అక్కడ ఎలాగూ విజయ్ సేతుపతికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈజీగా వైష్ణవ్ డెబ్యూ జరిగిపోతుంది. ఈ రకంగా రెండు ఉపయోగాలు ఉన్నాయి.

టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ సినిమా చేపలు పట్టే బెస్తవారి నేపథ్యంలో సాగుతుంది. విజయ్ సేతుపతి ఆ వర్గంపై బలమైన పట్టున్న నాయకుడిగా అందరికి శాశించే చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడట. అందుకే సైరాను చిరంజీవి కోసం ఒప్పుకుంటే దీన్ని కథ కోసం ఓకే చెప్పిన్నట్టు వినికిడి. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ సినిమాకు బడ్జెట్ పరంగానూ భారీగానే వెళ్తున్నట్టు టాక్. మొదటి సినిమాతో హిట్ కొట్టిన అన్నయ్య తరహాలో వైష్ణవ్ కి ఇది మంచి లాంచ్ గా నిలుస్తుందో లేదో చూడాలి