స్టార్ హీరో పాలిటిక్స్ లోకి రావట్లేదా?

Mon Apr 16 2018 12:26:35 GMT+0530 (IST)

కోలీవుడ్ లో అభిమానం అనే డోస్ హై పిచ్ లో ఉంటుందని అందరికి తెలిసిందే. అక్కడ స్టార్ హీరోలను దాదాపు దేవుడితో సమానంగా కొలిచేస్తారు. రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో స్టార్ హోదా అందుకున్న వారిలో విజయ్ ఉన్నాడు. మనోడి మార్కెట్ సినిమా సినిమాకు పెరుగుతున్నట్లే అభిమానుల సంఖ్య కూడా చాలా పెరుగుతోంది. అయితే విజయ్ గతంలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఆయన తండ్రి చంద్రశేఖర్ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అవును విజయ్ తప్పకుండా పాలిటిక్స్ ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ అయన నుండే విజయ్ రావడం లేదు అనే తరహాలో ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే కోలీవుడ్ లో ఇద్దరు లెజెండ్స్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రజినీకాంత్ - కమల్ హాసన్ వంటి ప్రముఖ స్టార్స్ మధ్య యుద్ధం మొదలైంది.

అయితే వారి మధ్యలోకి వెళితే ఇప్పుడున్న స్టార్ ఇమేజ్ కూడా ఎంతో కొంత డ్యామేజ్ కావచ్చని విజయ్ ఆలోచించాడట. అయితే ఫ్యాన్స్ నుంచి కొన్ని సలహాలు వెళ్లాయి. కొన్ని సామజిక కార్యక్రమాల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న తరువాత ఎంట్రీ ఇస్తే బావుంటుంది కదా అని చాలా చెప్పారట. కానీ విజయ్ తండ్రి నుంచి మాత్రం ఆ మాట వచ్చే సరికి ప్లాన్స్ మొత్తం ఎండ్ అయినట్లు తెలుస్తోంది.