Begin typing your search above and press return to search.

'మెర్సల్' అదిరింది

By:  Tupaki Desk   |   22 Sep 2017 4:51 AM GMT
మెర్సల్ అదిరింది
X
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత తర్వాత అత్యధిక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ‘ఇలయదళపతి విజయ్‌ ఒకరు. తనదైన శైలిలో సినిమాలను చేసిన ఈ హీరోని తమిళులు ‘ఇలయదళపతి’ అని ముద్దుగా పిలుచుకుంటారు. 100 కోట్ల మార్కెట్ ను కూడా సెట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ మార్క్ ను మరోసారి క్రాస్ చెయ్యడానికి రెడీ అయ్యాడు.

అట్లీ దర్శకత్వంలో ‘మెర్సెల్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు విజయ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా యొక్క టీజర్ రీసెంట్ గా విడుదలైంది. టీజర్ లో విజయ్ తన లుక్స్ అన్ని పర్ఫెక్ట్ చూపించాడు. చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేవిధంగా దర్శకుడు సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లోని లొకేషన్స్ కూడా చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీజర్ తో అట్లీ అదరగొట్టాడనే చెప్పవచ్చు .

ఇక ఈ సినిమాలో సమంత - కాజల్ మరియు నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో బాహబలి రచయిత కె. విజయేంద్రప్రసాద్ కలం కూడా కలిపారు. తెలుగులో ఈ సినిమా "అదిరింది" పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళి సందర్భంగా అక్టోబరు 18న రాబోతున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు.