Begin typing your search above and press return to search.

రజినీకాంత తర్వాత అక్కడ అతనే

By:  Tupaki Desk   |   19 Oct 2017 9:07 AM GMT
రజినీకాంత తర్వాత అక్కడ అతనే
X
కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిజల్ట్స్ తో సంబంధం లేకుండా రికార్డులు బద్దలు కొడుతుంటాయి. కోలీవుడ్ లో 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ధీరులు బాగానే ఉన్నారు. అటువంటి వారిలో విజయ్ ఒకడు. అతని లేటెస్ట్ సినిమా మెర్సల్ మొదటి రోజే రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేసింది. అట్లీ - విజయ్ కాంబినేషన్ మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు.

అయితే విజయ్ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి లాభాలను అందుకుంది. అక్కడ రజినీకాంత్ తర్వాత విజయ్ తన బాక్స్ ఆఫీస్ స్టామినాను చూపించాడు. 130 లొకేషన్స్ లో రిలీజ్ అయిన మెర్సల్ $ 350k రాబట్టింది. అక్కడ రజినీకాంత్ తర్వాత స్థానంలో ఇప్పుడు విజయ్ చేరాడు. అజిత్ - సూర్య అలాగే విక్రమ్ లకు కూడా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది.

అయితే మెర్సల్ ట్రైలర్ తోనే అంచనాలను రేపడంతో చాలా వరకు అడ్వాన్స్ టికెట్స్ తొందరగానే అయిపోయాయి. ఇక తమిళనాడులో కూడా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. విజయ్ అభిమానులు కూడా సినిమా బావుండడంతో సంబరాలు చేసుకుంటున్నారు.