Begin typing your search above and press return to search.

డివైడ్ టాక్.. అయినా వంద కోట్ల వసూళ్లు

By:  Tupaki Desk   |   22 Oct 2017 9:33 AM GMT
డివైడ్ టాక్.. అయినా వంద కోట్ల వసూళ్లు
X
దీపావళి కానుకగా విడుదలైన తమిళ సినిమా ‘మెర్శల్’.. రిలీజ్ రోజు నుంచి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లకైతే ఢోకా లేదు. కొన్ని కాంట్రవర్శీల వల్ల ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీనే వచ్చింది. కలెక్షన్లు కూడా స్టడీగా సాగిపోతున్నాయి. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఇంకా వీకెండ్ అవ్వకుండానే శనివారానికే ఈ చిత్రం వంద కోట్ల మార్కును దాటేసింది. ‘మెర్శల్’తో పాటుగా దీని తెలుగు వెర్షన్ కూడా విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడిపోయింది. అయినప్పటికీ తమిళ వెర్షన్ అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది.

విజయ్ కెరీర్లో ఇది ఐదో వంద కోట్ల సినిమా కావడం విశేషం. ఇంతకుముందు తుపాకి.. కత్తి.. తెరి.. భైరవ సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్బులో చేరాయి. కత్తి దగ్గర్నుంచి విజయ్ నటించిన ప్రతి సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుండటం విశేషం. ‘భైరవ’కు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ అది వంద కోట్ల మార్కును దాటింది. ఇప్పుడు ‘మెర్శల్’ కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మార్కును అందుకుంది. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశముంది. ‘మెర్శల్’ తెలుగు వెర్షన్ ‘అదిరింది’ ఎనిమిది రోజులు ఆలస్యంగా.. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రం దీపావళికి విడుదల కాలేదు.