కీర్తి చేసిన పనికి వారికి కోపం వచ్చింది

Wed Jun 13 2018 15:23:25 GMT+0530 (IST)

సినిమా ప్రపంచంలో తారలు ఎంత సింపుల్ గా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం వారిని  ఒక స్థాయిలో ఊహించుకుంటారు. వారిని ఎవరైనా కించ పరిస్తే అది మాములుగా ఉండదు. సిన్ మొత్తం మారిపోతుంది. కోలీవుడ్ లో అయితే అభిమానుల్లో ఆ వేడి మరి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మధ్య కీర్తి సురేష్ పై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం తమిళనాట వైరల్ అవుతోంది. మరోవైపు కీర్తికి ఆమె అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతం విజయ్ - కీర్తి సురేష్ ఒక సినిమాలో నటిస్తున్నారు. స్టార్ దర్శకుడు ఏ.ఆర్ మురగదాస్ ఆ ప్రాజెక్టు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమా చిత్రీకరణకు సంబందించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒక ఫొటోలో విజయ్ కింద కూర్చొని ఉండగా.. హీరోయిన్ కీర్తి సురేష్ సోఫా మీద కూర్చొని విజయ్ మీద కాలు పెట్టింది. దీంతో విజయ్ అభిమానులు కీర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ మీద కాలు పెట్టడం ఏమిటని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో కీర్తికి ఆమె ఫాలోవర్స్ మద్దతుగా నిలుస్తూ ఫొటోని తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టైటిల్ ను కూడా రెడీ చేసుకున్నారట. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్బంగా టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక తూత్తుకూడి ఘటన కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు నిర్వహించవద్దని విజయ్ కోరాడు.