పోర్న్ లాగే పైరసీని బ్యాన్ చేయాలి

Thu Nov 15 2018 23:00:01 GMT+0530 (IST)

గీతగోవిందం ట్యాక్సీవాలా పైరసీతో దేవరకొండ డీప్‌గానే ట్రబుల్ ఎదుర్కొన్నాడని అతడి వ్యాఖ్య ఒకటి చెబుతోంది. లీకైనా గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో పైరసీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది కదా? అని నేటి ట్యాక్సీవాలా ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే .. నిజమే కానీ.. అన్ని సినిమాలకి అలాగే జరగాలని లేదు. పైరేట్‌ల వల్ల ప్రభావం ఉంటుంది. ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారా లేదా అన్న టెన్సన్స్  ఇబ్బంది  పెడతాయి. పెళ్లి చూపులు సినిమా ఫైరసీ అయి ఉంటే నేను ఉండేవాడినా? నేను ఇంతదూరం వచ్చి ఉండేవాడినా?  ఫైరసీని బ్యాన్ చెయ్యాలి. పోర్న్ సైట్స్ ను బ్యాన్ చేసినట్లుగానే ఫైరసీ సైట్స్ ను వందశాతం బ్యాన్ చెయ్యాలి.. అప్పుడే సమస్య తొలగిపోతుంది.. అన్నారు విజయ్.మీ సినిమాలు మాత్రమే ఎందుకు ఫైరసీ అవుతున్నాయి? ఎవరైనా కావాలని చేస్తున్నారా ? అని ప్రశ్నిస్తే.. మీలాగే నాక్కూడా తెలియదు. అయితే ఎవరో కావాలని ఇలా చేస్తున్నారని అనుకోవడం లేదు. పైరసీ అనేది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో తెలిసినివారే చెయ్యడానికి అవకాశం ఉంది. ‘గీత గోవిందం’ కూడా అలాగే ఫైరసీ అయింది. ఏమైనా ఒక సినిమాని ఫైరసీ చేస్తే.. ఆ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరి లైఫ్ తో ఆడుకున్నట్లే. దీని వల్ల చాలా టెన్షన్ కి ప్రెజర్ కి గురి అవ్వాల్సి వస్తోంది.

మరి ఫైరసీని కంట్రోల్ చెయ్యటానికి ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ? అని ప్రశ్నిస్తే..అసలు ఎవరు పైరసీ చేస్తున్నారో తెలిస్తే వాళ్ళపై యాక్షన్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. చాలా ఫైరసీ సైట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ బ్యాన్ చేయించాలి అన్నారు. ఇప్పుడు దేవరకొండ ఇలా అన్నాడు కాబట్టి విశాల్‌ని అటకాయించినట్టు అటకాయిస్తారా పైరేట్‌లు?