Begin typing your search above and press return to search.

హిందీ 'అర్జున్‌ రెడ్డి' పై విజయ్‌ ఫస్ట్‌ కామెంట్‌

By:  Tupaki Desk   |   16 Nov 2018 1:30 AM GMT
హిందీ అర్జున్‌ రెడ్డి పై విజయ్‌ ఫస్ట్‌ కామెంట్‌
X
విజయ్‌ దేవరకొండను ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ చేసిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. యూత్‌ ను విపరీతంగా ఆకట్టుకున్న అర్జున్‌ రెడ్డి సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ యూత్‌ ఐకాన్‌ గా మారిపోయాడు. అర్జున్‌ రెడ్డి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పలు భాషల్లో రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌ తో తెరకెక్కుతూ టీజర్‌ కూడా వచ్చేసింది. ఇక అందరి దృష్టి అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌ పై ఉంది.

హిందీలో అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కు ఒరిజినల్‌ వర్షన్‌ దర్శకుడు అయిన సందీప్‌ వంగనే దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్‌ కపూర్‌ హీరోగా రూపొందుతున్న ఈ రీమేక్‌ కు ‘కబీర్‌ సింగ్‌’ అనే టైటిల్‌ ను ప్రకటించారు. సినిమా ప్రారంభం అయ్యి చాలా రోజులు అయ్యింది. ఎట్టకేలకు విజయ్‌ దేవకొండ రీమేక్‌ గురించి స్పందించాడు. ‘అర్జున్‌ రెడ్డి’ అనే టైటిల్‌ ను పెట్టినప్పుడు అంతా కూడా ఇదేదో ఫ్యాక్షన్‌ మూవీ అనుకున్నారు. ట్రైలర్‌ వచ్చేంత వరకు సినిమా గురించి ఎవరు పెద్దగా ఆలోచించలేదు. కాని హిందీ రీమేక్‌ విషయంలో అలా కాదు. ‘కబీర్‌ సింగ్‌’ టైటిల్‌ చాలా బాగుంది.

తప్పకుండా దర్శకుడు సందీప్‌ వంగ అక్కడ కూడా ఏదో ఒక మ్యాజిక్‌ చేస్తాడనే నమ్మకం ఉందని విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. టీజర్‌ - ట్రైలర్‌ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఈయన మరో రెండు రోజుల్లో ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంను కూడా విడుదలకు సిద్దం చేస్తున్నాడు.