రీ షూట్స్ తోనే కామ్రేడ్ కాలం గడిపేస్తున్నాడు

Thu Apr 25 2019 20:00:01 GMT+0530 (IST)

ఎవరేజ్ సినిమా కూడా తనకు ఫ్లాప్ తోనే సమానం అని స్టేట్ మెంట్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ - తన సినిమాలు కచ్ఛితంగా సూపర్ హిట్స్ కొట్టాలనే ఉద్దేశంతో తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ - పోస్ట్ ప్రొడక్షన్ ఆ తరువాత వచ్చే పబ్లిసిటీ విషయంలో కూడా విజయ్ ఫైనల్ డెసిషన్ తరువాతే పనులు జరుగుతున్నాయని తెలిసింది. ఇదే తరహాలో ప్రస్తుతం విజయ్ అప్ కమింగ్ మూవీ డియర్ కామ్రేడ్ తెరకెక్కుతుందని అంటున్నారు. కాకినాడ - తుని పరిశర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దాదాపు 60 రోజులు షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన చిత్ర యూనిట్ కి నిరాశే ఎదురైందట - ఎందుకంటే ఈ షూట్ రష్ చూసిన విజయ్ దేవరకొండ అది నచ్చకపోవడంతో రీషూట్ చేయాల్సిందిగా దర్శకనిర్మాతలకు సూచించాడని చెబుతున్నారు.ఈ రీషూట్ ని నిర్మాతలు దగ్గర నుంచి గ్రీన్ సిగ్నెల్ వచ్చినప్పటికీ దర్శకుడు దీనికి ఒప్పుకొకపోవడంతో ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చి మరో ప్రాజెక్ట్ చేయడానికి విజయ్ దేవరకొండ రెఢీ అయ్యాడని సమాచారం. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ దర్శకుడుని ఒప్పించి మళ్లీ దాదాపు 45 రోజులు ఈ సినిమాను రీషూట్ చేయించారట - అయితే ఈ రీషూట్ విషయంలో కూడా విజయ్ నిరాశతో ఉన్నాడని టాక్ - అయితే ప్రస్తుతానికి ఎడిటింగ్ వర్క్ స్టార్ చేసి - ఆ తరువాత ఏమైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే ఆ సన్నివేశాలు వరుకు మరో షెడ్యూల్ షూటింగ్ పెట్టుకుందామనే నిర్ణయానికి డియర్ కామ్రేడ్ టీమ్ వచ్చిందని - ఈ నేపథ్యంతోనే డియర్ కామ్రేడ్ కు సంబంధించిన పబ్లిసిటీ కంటెంట్ ని చాలా జాగ్రత్తగా విడుదల చేస్తున్నారట - కేవలం ఓ టీజర్ ని మాత్రమే ఇంతవరుకు డియర్ కామ్రేడ్ టీమ్ విడుదల చేసింది. టైటిల్ లో ఉన్న కామ్రేడ్స్ ని గౌరవం ఇచ్చేందుకు మే 1న ఏదైనా స్పెషల్ సర్పరైజ్ ను విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ గీతగోవిందం ఫేమ్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఓ క్రికెటర్ ఈ సినిమాలో నటిస్తోంది.