Begin typing your search above and press return to search.

ఇక దేవరకొండ కన్ను టాప్ స్టార్ లీగ్ పైనేనా?

By:  Tupaki Desk   |   17 Aug 2018 7:44 AM GMT
ఇక దేవరకొండ కన్ను టాప్ స్టార్ లీగ్ పైనేనా?
X
'గీత గోవిందం' సక్సెస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్. సినిమాలో ఉన్నది సక్సెస్ ఫుల్ కంటెంటే అయినా అది హిట్ కావడానికి మాత్రమే సరిపోతుంది. కానీ బ్లాక్ బస్టర్ కావడానికి సరిపోదు. దానికి ఒక స్టార్ హీరో నో లేదా క్రేజీ హీరోనో అవసరం. విజయ్ దేవరకొండ రూపంలో 'గీత గోవిందం' సినిమాకు సరిగ్గా అదే దొరికింది.

అసలే 'అర్జున్ రెడ్డి' సినిమాలో ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ను - క్రిటిక్స్ ను కట్టిపడేసిన విజయ్ తన 'రౌడీ' యాటిట్యూడ్ తో యూత్ ను తన అభిమానులుగా మార్చుకున్నాడు. సరిగ్గా చెప్తే ఇప్పటి జెనరేషన్ యూత్ కు సరైన ప్రతినిధి గా మారాడు. ఆ క్రేజ్ ఇప్పుడు 'గీత గోవిందం' ఫస్ట్ డే కలెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయింది. దాదాపుగా మీడియం రేంజ్ హీరోలందరినీ ఒకే దెబ్బకు క్రాస్ చేశాడు విజయ్. మీడియం రేంజ్ హీరోలయిన నాని - సాయి ధరమ్ తేజ్ - నితిన్ సినిమాల హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ను విజయ్ సినిమా దాటడం పెరిగిన విజయ్ బాక్స్ ఆఫీస్ స్టామినా కు నిదర్శనం. ఒక రకంగా మీడియం రేంజ్ లో టాప్ సీట్ సాధించినట్టే.

ఇక నెక్స్ట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. దాదాపు అన్నిట్లో విజయ్ ఒక్కడే క్రౌడ్ పుల్లింగ్ ఫాక్టర్. నెక్స్ట్ రిలీజ్ కానున్న 'టాక్సీవాలా' కు డైరెక్టర్ రాహుల్ సాంకృతాయన్. ఆ తర్వాత 'నోటా' కు డైరెక్టర్ ఆనంద్ శంకర్. తమిళ డైరెక్టర్ అయిన ఈ ఆనంద్ శంకర్ పెద్ద స్టార్ డైరెక్టర్ ఏమీ కాదు. 'అరిమ నంబి' లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం - విక్రమ్ తో 'ఇరుముగన్(తెలుగులో 'ఇంకొక్కడు') అయన ఇప్పటి వరకూ చేసిన సినిమాలు. ఇక విజయ్ మూడో సినిమా గురించి మాట్లాడుకుంటే.. 'డియర్ కామ్రేడ్' డైరెక్టర్ భరత్ కమ్మ కిది మొదటి సినిమా. విజయ్ ఈ మూడూ కాకుండా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. క్రాంతి మాధవ్ కు దర్శకుడి గా మంచి పేరే ఉన్నా స్టార్ లీగ్ డైరెక్టర్ కాదు. సో.. ఈ అన్నీ సినిమాల్లో విజయ్ ఒక్కడే క్రౌడ్ పుల్లర్.. సినిమా సెల్లింగ్ ఫాక్టర్. విజయ్ ను చూసే ఆడియన్స్ సినిమా వస్తారు.

పైగా నాలుగు సినిమాల్లో విజయ్ పాత్రలు కూడా పూర్తిగా డిఫరెంట్. ఒకదాన్లో టాక్సీ డ్రైవర్.. మరో సినిమాలో పొలిటికల్ యాక్టివిస్ట్, ఇంకో చిత్రంలో స్టూడెంట్ లీడర్.. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ క్రాంతి మాధవ్ సినిమాలో ఐటీ ప్రొఫెషనల్.

ఈ సినిమాల్లో ఏవి హిట్ అయినా మిడ్ రేంజ్ దాటి టాప్ లీగ్ కు చేరే అవకాశం ఫుల్లు గా ఉన్నట్టే. మరోవైపు హైప్ అంతా కూడా విజయ్ మీదే ఉంటుంది కాబట్టి ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాటింది. మార్కెట్ దెబ్బ తినే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక కెరీర్లో వేగంగా మెట్లెక్కే దశ కాబట్టి రౌడీ వేషాలు వేయడం వరకూ ఒకే గానీ 'తప్పులు' చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. అలా కాస్త జాగ్రత్తగా ఉంటే టాప్ లీగ్ లో చేరడం ఆసాధ్యం మాత్రం కాదు.