ఫోర్బ్స్ ఇంటర్వ్యూ: రౌడీగారి స్టైల్ అదిరిందే!

Sat Jan 19 2019 11:56:39 GMT+0530 (IST)

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఈమధ్య ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు ప్రకటించే టాప్ 100 సెలబ్రిటీల లిస్టులో స్థానం సాధించిన విషయం ఇప్పటికే వార్తల్లో వచ్చింది.  ఈ సందర్భంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు చేసే ఇంటర్వ్యూకు ఉత్సాహంగా రెడీ అయ్యాడు టాలీవుడ్ రౌడీ.  సూటు బూటులో యమా స్టైల్ గా ఉన్న ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఈ విడియో క్లిప్ నిడివి తక్కువే ఉన్నప్పటికీ విజయ్ బ్లాక్ కలర్ లాంగ్ కోటు వేసుకొని చేతులను జేబుల్లో పెట్టుకొని ఫోటోగ్రాఫర్ కు పోజులిస్తున్నాడు.  యాజ్ యూజువల్ గా రౌడీగారి పోజు అదిరిపోయింది.   ఈ వీడియో క్లిప్ ను చూసిన ఫ్యాన్స్ ఫోర్బ్స్ ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   ఇంటర్వ్యూలో ఫోర్బ్స్ వారు ఎలాంటి ప్రశ్నలు అడిగారో మన రౌడీగారు వాటికి ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే మనం కూడా ఆ ఇంటర్వ్యూ కోసం వేచి చూడాల్సిందే.

సినిమాల విషయానికి వస్తే విజయ్ ప్రస్తుతం నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న 'డియర్ కామ్రేడ్' లో నటిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.  ఈ సినిమా పూర్తి కాగానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాను మొదలుపెడతాడు.