విజయ్-సమంత మళ్లీ జట్టు కట్టారు

Sun Dec 16 2018 19:18:37 GMT+0530 (IST)

మహానటి’ సినిమాతో మురిపించిన జంట విజయ్ దేవరకొండ.. సమంత. ఆ చిత్రంలో వారి చిట్టి ప్రేమకథ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరీ వీర లెవెల్లో రొమాన్స్ పండించేయలేదు కానీ.. భలే చమత్కారంగా అనిపిస్తుంది వారి ప్రేమ కథ. ఆ సినిమాలో వారి జంట మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పడీ జంట మరోసారి చేతులు కలిపింది. కానీ ఈసారి సినిమా కోసం కాదు. ఒక ఈకామర్స్ వెబ్ సైట్ కోసం. ఫ్లిప్ కార్ట్ సంస్థ విజయ్.. సమంతలను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది. ఈ సంస్థ ఇయర్ ఎండ్ సేల్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. భారీగా ఆఫర్లు ప్రకటిస్తోంది. దీనికి సంబంధించిన ప్రచారం కోసం విజయ్.. సమంత రంగంలోకి దిగారు. ఇద్దరూ కలిసి ఉద్ధృతంగా ఫ్లిప్ కార్ట్ కు ప్రచారం చేస్తున్నారు. వీరితో రూపొందించిన ప్రకటనలు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.సమంత స్టార్ హీరోయిన్ అయిన కొన్నేళ్ల నుంచే అనేక బ్రాండ్లకు ప్రచారం చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె జోరేమీ తగ్గలేదు. ఇప్పుడు కూడా ఆమె చేతిలో చాలానే బ్రాండ్లున్నాయి. ఇక ‘అర్జున్ రెడ్డి’తో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ చూసి.. చాలా బ్రాండ్లు అతడి గుమ్మం ముందుకొచ్చాయి. కళామందిర్ ఫ్యాషన్ మాల్ తో పాటుగా సంగీతా మొబైల్స్.. ఐటీసీ తదితర బ్రాండ్లకు అతను ప్రచారం చేస్తున్నాడు. ఏం చేసినా క్రియేటివ్ గా చేసే విజయ్ వల్ల ఆయా బ్రాండ్లకు మంచి ప్రచారం దక్కుతోంది. రోజు రోజుకూ విజయ్ క్రేజ్ పెరుగుతుండటంతో భవిష్యత్తులో అతడి చేతికి మరిన్ని బ్రాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.