కేరళ కుట్టిలతో డియర్ కామ్రేడ్

Sun Apr 14 2019 16:35:42 GMT+0530 (IST)

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' ప్రస్తుతం  చివరి దశ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కుడా కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈమధ్య రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకవైపు యాంగ్రీ యాంగ్రీ యంగ్ స్టర్ గా ఫైట్లు.. మరోవైపు రొమాంటిక్ గా హీరోయిన్ రష్మికతో లిప్ లాకు.. యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యాయి.  ఒక వైపు ప్రమోషన్స్ కొనసాగుతూ ఉన్నాయి.  మరోవైపు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం.గత కొద్దిరోజులుగా 'డియర్ కామ్రేడ్' టీమ్ కేరళ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.  కేరళలోని అతిరాపల్లి ఫాల్స్ షూటింగ్ పూర్తి చేశారని సమాచారం.  ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ - రష్మికలు ఓ పది మంది కేరళ అమ్మాయిలతో పోజిచ్చారు.  వారందరూ కేరళ సంప్రదాయంలో తెల్లచీర కట్టుకున్నారు.   ఈ ఫోటో చూస్తుంటే కేరళ లోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో పాట చిత్రీకరణ సందర్భంగా ఈ ఫోటో తీసినట్టుంది.  విజయ్ - రష్మిక తో పాటు అందరూ చిరునవ్వులు చిందిస్తూ పోజివ్వడంతో ఫోటో బ్రైట్ గా ఉంది.

డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.  తెలుగుతో పాటు తమిళ.. కన్నడ.. మలయాళ భాషలలో ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.  'డియర్ కామ్రేడ్' మే 31 న రిలీజ్ కానుంది.