దేవరకొండ ఊ అంటే ప్రమోషన్స్ స్టార్ట్

Mon Feb 18 2019 16:55:07 GMT+0530 (IST)

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఇదే సినిమాతో రాజశేఖర్-జీవితల రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.  మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందని సమాచారం.'దొరసాని' టైటిల్ తో తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరంగల్ లో ఒక భారీ షెడ్యూల్.. సిద్ధిపేట్ లో మరో షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు.  సినిమా షూటింగ్ 90% పైగా పూర్తయినా ఇంకా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు.  దానికి ఒక కారణం ఉందట.  ఈ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ సాయం తీసుకోవలనేది నిర్మాతల ఆలోచనట. కానీ విజయ్ తన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో తమ్ముడి డెబ్యూ సినిమాకు సమయం కేటాయించలేకపోతున్నాడట.  మరోవైపు డా. రాజశేఖర్ కూడా 'కల్కి' సినిమా తో బిజీగా ఉన్నారు.  విజయ్.. రాజశేఖర్ కాస్త ఫ్రీ అయిన తర్వాత 'దొరసాని' ప్రమోషన్స్ మొదలు పెడతారట.  అప్పటి వరకూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఆలోచన లేదట.

ఒక్కసారి విజయ్ దేవరకొండ సీన్లోకి ఎంట్రీ ఇస్తే ప్రమోషన్స్ స్వరూపమే పూర్తిగా మారిపోతుందనడంలో సందేహమే లేదు.   ఈ సినిమాను మధుర శ్రీధర్.. యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  రీసెంట్ గా ఈ సినిమాలో భాగస్వామిగా డీ. సురేష్ బాబు కూడా జాయిన్ అయ్యారని సమాచారం.