Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల దారిలో విజయ్ దేవరకొండ

By:  Tupaki Desk   |   27 May 2019 7:32 AM GMT
స్టార్ హీరోల దారిలో విజయ్ దేవరకొండ
X
కెరీర్ ప్రారంభంలో ఏ సంస్థతో చేసినా హీరోలకు ఒక స్టార్ స్టేటస్ వచ్చాక స్వంత బ్యానర్ లో చేసుకోవాలి అనిపించడం సర్వ సాధారణం. చిరంజీవికి గీత ఆర్ట్స్ నాగార్జునకు అన్నపూర్ణ స్టూడియోస్ వెంకటేష్ కు సురేష్ సంస్థ బాలకృష్ణకు రామకృష్ణ ప్లస్ భార్గవ్ ఆర్ట్స్ ఇలా అందరూ ప్లానింగ్ తో వెళ్లినవాళ్ళే. ఈ తరంలో తీసుకున్నా మహేష్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అందరికి స్వంత ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇదే దారిలో వెళ్ళబోతున్నట్టు కనిపిస్తోంది.

తన టెక్స్ టైల్ బ్రాండ్ రౌడీతో పాటు నిర్మాణ సంస్థ కింగ్ అఫ్ ది హిల్స్ ని స్థాపించిన విజయ్ దేవరకొండ దాని మీద సినిమాల నిర్మాణం ఇంకా మొదలుపెట్టలేదు. కారణం లేకపోలేదు. గతంలో కమిట్ అయిన సినిమాల క్యూ చాంతాడంత ఉండటంతో అవన్నీ పూర్తి చేసేసరికి ఎంత లేదన్నా ఏడాదిన్నర పడుతుంది. తర్వాత సైన్ చేయబోయే ప్రతి సినిమా కింగ్ అఫ్ ది హిల్స్ భాగస్వామ్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ కథ దర్శకుడు రెండూ నచ్చి వర్క్ అవుట్ అవుతాయి అనిపిస్తే స్వంతంగా పెట్టుబడి పెట్టేస్తాడు. లేదా ఏదైనా మంచి కథతో కాంబోతో వేరే బ్యానర్ వస్తే అందులో పార్ట్ నర్ షిప్ అడుగుతాడు.

ఏదైతేనేం తన కింగ్ అఫ్ హిల్స్ ని బ్రాండింగ్ చేసే పనిలో పడ్డాడు విజయ్. డియర్ కామ్రేడ్ రిలీజ్ అయ్యాక మరో రెండు సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవితో పాటు మల్టీ లాంగ్వేజ్ లో ఆనంద్ అన్నామలై తీస్తున్న హీరో కూడా ఆ తర్వాత వస్తుంది.ఇవి కాకుండా ఇంకో రెండు చేయాల్సి ఉంది. ఈ కమిట్ మెంట్స్ అన్ని పూర్తయ్యాక విజయ్ దేవరకొండ ప్రతి సినిమాలో కింగ్ అఫ్ ది హిల్స్ లోగో కనిపించే ఛాన్స్ ఉందన్న మాట.