అందులో దేవరకొండకిద్దరు!

Thu Oct 11 2018 17:17:05 GMT+0530 (IST)

విజయ్ దేవరకొండ 'నోటా' తో మరోసారి బాక్స్ ఆఫీస్ దుమ్ముదులుపుతాడని అంచనాలు ఉన్నప్పటికీ అవేవీ నిజం కాలేదు. సినిమా అందరినీ నిరాశపరిచింది.  విజయ్ అయితే ఫ్యాన్స్ కు ఓ  పెద్ద లెటర్ రాసి మరీ ఈ అనుభవం నుండి ఏం జరిగిందో తెలుసుకుంటానని నెక్స్ట్ టైమ్ మరింత స్ట్రాంగ్ గా వస్తానని చెప్పాడు.  విజయ్ లైనప్ లో ఇప్పుడు 'టాక్సివాలా'.. 'డియర్ కామ్రేడ్' సినిమాలున్నాయన్న విషయం తెలిసిందే.  ఇవే కాకుండా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్ రామారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాలో హీరోయిన్లుగా రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్ లను ఎంపిక చేశారట.  రాశి ఖన్నా మన తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు..మరి ఐశ్వర్య ఎవరు? సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మి ఉంది కదా.. ఆవిడ మేనకోడలే ఈ ఐశ్వర్య.   తమిళంలో 'వడ చెన్నై'.. 'ధృవ నట్చత్తిరం' సినిమాలలో నటించింది. తెలుగులో ఇదే ఆమె కు డెబ్యూ ఫిలిం. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇదో న్యూ ఏజ్ లవ్ స్టొరీ అని.. రీసెంట్ గా క్రాంతి మాధవ్ ఫుల్ స్క్రిప్ట్ తో విజయ్ దేవరకొండ ను ఇంప్రెస్ చేశాడని సమాచారం. 

ఇదిలా ఉంటే దర్శకుడు నిర్మాత ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఒకవైపు దర్శకుడు క్రాంతి మాధవ్ లాస్ట్ సినిమా 'ఉంగరాల రాంబాబు' ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. మరోవైపు ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు చివరి సినిమా 'తేజ్ ఐ లవ్ యూ' కూడా ఫ్లాపే. ఇక ఇద్దరూ ఖచ్చితంగా హిట్ సాధించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మరి వీరిని విజయ్ దేవరకొండ  హిట్ బాటలోకి తీసుకోస్తాడా లేదా వేచి చూడాలి.