Begin typing your search above and press return to search.

చొక్కా లేని శ్రీ‌మంతుడు

By:  Tupaki Desk   |   12 Nov 2018 4:59 PM GMT
చొక్కా లేని శ్రీ‌మంతుడు
X
`దేశ‌ముదురు`లో బ‌న్ని చొక్కా విప్పిన‌ప్పుడు లేని క్రేజు.. `ధృవ‌`లో రామ్‌ చ‌ర‌ణ్ ష‌ర్ట్‌లెస్ జిమ్‌బోయ్‌గా క‌నిపించిన‌ప్పుడు లేని క్రేజు.. `టెంప‌ర్‌`లో ఎన్టీఆర్ 6ప్యాక్ చూపించిన‌ప్పుడు లేని క్రేజు.. అంతెందుకు 1-నేనొక్క‌డినే చిత్రంలో ష‌ర్ట్‌లెస్ ఫోజులో షాకిచ్చిన‌ మ‌హేష్‌ కి లేని క్రేజు... ఇదిగిదిగో దేవ‌ర‌కొండ ష‌ర్ట్ లేకుండా క‌నిపిస్తే పిచ్చి క్రేజు క‌నిపిస్తోంది. అత‌డు ష‌ర్ట్ విప్పేస్తే చాలు గాళ్స్ ఫిదా అయిపోతున్నారు. అందుకే ప‌దే ప‌దే దేర‌కొండ చొక్కా విప్పి క‌నిపిస్తున్నాడు.

ఇంకా చెప్పాలంటే దేవ‌ర‌కొండ చొక్కా లేని శ్రీ‌మంతుడిగా అల‌రిస్తున్నాడు. త‌న సినిమాల ట్రైల‌ర్స్‌ ని ప‌రిశీలిస్తే ఈ సంగ‌తి ఇట్టే అర్థ‌మైపోతోంది. ఇదివ‌ర‌కూ అర్జున్‌ రెడ్డి - నోటా సినిమాల్లో ష‌ర్ట్‌ లెస్ ఫోజులో క‌నిపించాడు. మ‌ళ్లీ ఇప్పుడు ట్యాక్సీవాలా ట్రైల‌ర్‌ లోనూ చొక్కా లేకుండానే స‌ర్‌ ప్రైజ్ చేశాడు. పైగా చొక్కా లేకుండా ఒరిజినాలిటీని బ‌య‌ట పెట్టేస్తున్నాడు. నేచుర‌ల్ లుక్ లో క‌నిపించి కాలేజ్ గాళ్స్ కి క‌ల‌ల రాకుమారుడు అయిపోతున్నాడు.

ఆక‌ర్షించాలంటే 6ప్యాక్‌ లు అవ‌స‌రం లేదు.. జిమ్ముల‌కు వెళ్ల‌న‌క్క‌ర్లేదు. మినిమం క‌స‌ర‌త్తులు స‌రిపోతాయి అని దేవ‌ర‌కొండ లుక్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. మాంచి జోష్‌తో క‌నిపిస్తూ.. సెన్సాఫ్ హ్యూమ‌ర్‌ తో ఆక‌ట్టుకోవ‌డం - వేదిక‌ల‌పై మాట్లాడేప్పుడు బ్రిలియ‌న్సీ చూపించ‌డం ఇవ‌న్నీ దేవ‌ర‌కొండ ఫాలోయింగ్‌ ని అంత‌కంత‌కు పెంచుతున్నాయి. నేచుర‌ల్ స్టార్ నాని త‌ర్వాత ఇలాంటి విష‌యాల్లో దేవ‌రకొండ మేధోత‌నం ఆ స్థాయిలో వ‌ర్క‌వుట‌వుతోంది. అందుకే ఇప్పుడు అత‌డు మోస్ట్ వాంటెడ్ హీరోగా వెలిగిపోతున్నాడ‌న్న‌మాట‌!!