Begin typing your search above and press return to search.

నోటాకు అంతిస్తున్నారా?

By:  Tupaki Desk   |   22 Aug 2018 7:10 AM GMT
నోటాకు అంతిస్తున్నారా?
X
ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లోనే కాదు టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం చర్చకు వస్తున్న హీరో విజయ్ దేవరకొండ. మూడో సినిమాకే ఇంత క్రేజ్ సాధ్యం కావడం గురించి తోటి సీనియర్ హీరోలు సైతం ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. దానికి తగ్గట్టే గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర చేస్తున్న రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 15 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఓ సినిమా మొదటి వారం గడవకుండానే ఏకంగా రెండింతలు పెట్టుబడి వెనక్కు ఇవ్వడం తలలు పండిన స్టార్ హీరోల వల్లే కాలేదు. అర్జున్ రెడ్డి సైతం ఇలాంటి సెన్సేషన్ టాక్ తెచ్చుకున్నా అందులో ఉన్న ఇంటెన్స్ కంటెంట్ వల్ల ఫామిలీ ఆడియన్సుకి దూరంగా ఉండాల్సి వచ్చింది. గీత గోవిందంకు ఆ సమస్య లేదు. వాళ్ళే నెత్తినబెట్టుకుంటున్నారు. రేంజ్ ఎక్కడి దాకా వెళ్తుందో ఇప్పటికీ ఊహకు అందటం లేదు. వీక్ ఎండ్ ని ఫుల్ గా వాడుకున్న గీత గోవిందం రెండో వారం మొదటి రోజే బక్రీద్ రూపంలో మరో హాలిడేను సాధించి పండగ చేసుకుంటోంది. ఈ నేపధ్యంలో ఇంత డిమాండ్ ఉన్న విజయ్ రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు అనే అనుమానం రావడం సహజం.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇప్పుడు విజయ్ దేవరకొండ ఛార్జ్ చేస్తున్న మొత్తం అక్షరాలా 3 కోట్లట. కానీ అర్జున్ రెడ్డి షూటింగ్ టైంలోనే గీత గోవిందం సైన్ చేసాడు కాబట్టి అప్పుడున్న మార్కెట్ ప్రకారం కేవలం 50 లక్షలకే ఒప్పుకున్నాడట. ఇప్పుడు ఏకంగా ఆరు రేట్లు పెరిగే దాకా మార్కెట్ ఎదిగిపోయింది అంటే మామూలు విషయమా. నోటాతో పాటు డియర్ కామ్రేడ్ కు కొత్త రేట్ ప్రకారం తీసుకుంటున్నాడని సమాచారం. ఇలాంటివి అధికారికంగా వెల్లడి కావు కాబట్టి నిజం కాదని చెప్పే అవకాశం లేని మొత్తమే అనిపిస్తోంది. ఒకవేళ నిజమే అయితే కనీసం ఓ ఐదేళ్లు విపరీతంగా కష్టపడి ఓ ఐదారు భారీ హిట్లు కొడితే తప్ప రాని డిమాండ్ విజయ్ దేవరకొండకు ఇప్పుడే రావడం విశేషం. మొత్తానికి కృషితో పాటు సుడి కలిసి వస్తే తక్కువ టైంలోనే ఎలా దూసుకుపోవచ్చో విజయ్ దేవరకొండ ఉదాహరణగా మారుతున్నాడు.