Begin typing your search above and press return to search.

బ్రేకప్ కు రెడీ అయిన రౌడీగారు

By:  Tupaki Desk   |   21 May 2019 5:45 PM GMT
బ్రేకప్ కు రెడీ అయిన రౌడీగారు
X
విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. జస్ట్ టాలీవుడ్ కాదు.. సౌత్ అంతా యూత్ ఆడియన్స్ లో గుర్తింపు ఉన్న హీరో. తన సినిమాలు.. యాక్టింగ్ తోనే కాకుండా రౌడీ యాటిట్యూడ్.. ఫ్యాషనబుల్ డ్రెస్ సెన్స్ తో అందరినీ తనవైపుకు తిప్పుకుంటున్నాడు. విజయ్ తన స్టైల్ కు తగ్గట్టే డిఫరెంట్ సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ సాగిపోతున్నాడు.

భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' జూలై 26 న రిలీజ్ కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా తాజాగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో 'హీరో' అనే సినిమా లాంచ్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు క్రాంతి మాధవ్ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బైటకు వచ్చింది. ఈ సినిమాకు 'బ్రేకప్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. రాశి ఖన్నా... ఐశ్వర్య రాజేష్.. ఫారెన్ మోడల్ ఇజబెల్ లీట్ ఈ సినిమాలో విజయ్ తో రొమాన్స్ చేస్తున్నారు. ఈ సినిమా కథ మొత్త మన రౌడీగారు ఆ భామలతో లవ్వులో పడడం.. బ్రేక్ అప్ చెప్పడం చుట్టూనే తిరుగుతుందట. అందుకే ఇలాంటి టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనే ఆలోచనతో ఫిలిం మేకర్స్ ఉన్నారట.

అసలే ఒక హీరోయిన్ అంటేనే లిప్పులు అదే పనిగా లాక్ చేసే రౌడీగారికి ముగ్గురు హీరోయిన్లను సెట్ చేశారు. ఈసారి ప్రేక్షకులు ముద్దులవానలో తడిసి ముద్దవడం ఖాయమే. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'.. 'ఓనమాలు' లాంటి అభిరుచి గల సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్ విజయ్ కోసం ఎలాంటి స్టొరీ రెడీ చేసిపెట్టాడో వేచి చూడాలి. 'బ్రేకప్' టైటిల్ మాత్రం ట్రెండీగా విజయ్ స్టైల్ కు తగ్గట్టుగా ఉంది.