తమిళనాట గోవిందానికి అగ్ర తాంబూలం!

Fri Aug 17 2018 19:59:35 GMT+0530 (IST)

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘గీత గోవిందం’ పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఓ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ లతో అదరగొట్టింది. ఇక ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న గోవింద్...తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా  దాదాపు రూ. 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా విజయ్ గోవింద్ తన మ్యాజిక్ తో వర్కింగ్ డే నాడూ 9 కోట్లు వసూలు చేశాడు. తెలుగునాటే కాదు...తాజాగా ఈ చిత్రం తమిళనాట కూడా రికార్డులకు సృష్టించింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా `గీత గోవిందం` తొలి రోజు రూ.1.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం రేపింది. టాలీవుడ్ సూపర్ స్టార్లకు కూడా సాధ్యం కాని ఫీట్ ను అప్ కమింగ్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి `అర్జున్ రెడ్డి`...రూ.3 కోట్ల మార్కును దాటుతాడని అంచనా.తమిళ తంబీలకు తెలుగు సినిమాలు ఓ పట్టాన ఆకట్టుకోవు. అయితే గత ఏడాది విడుదలైన`అర్జున్ రెడ్డి`కి తమిళ తంబీలతో పాటు సెలబ్రిటీలు సినీ తారలు కూడా ఫిదా అయ్యారు. చెన్నైలో 10 రోజుల పాటు అర్జున్ రెడ్డి హౌస్ ఫుల్ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఆ చిత్రాన్ని చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్`వర్మ` పేరుతో రీమేక్ చేసేందుకు రెడీ అవ్వడంతో దానిని థియేటర్ల నుంచి తొలగించారు. అయితేనేంఅప్పటికే విజయ్ నటనకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా `గీత గోవిందం`కు తమిళ తంబీలు కనెక్ట్ కావడానికి అర్జున్ రెడ్డి దోహదపడ్డాడు. అందుకే టాలీవుడ్ సూపర్ స్టార్లకు కూడా రాని రేంజ్ లో గోవింద్ కు ఓపెనింగ్స్ వచ్చాయి. ‘భరత్ అనే నేను’ను కూడా తమిళనాట తొలి రోజు ఇంతటి వసూళ్లు రాలేదంటే విజయ్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గీత గోవిందం రిజల్ట్ చూస్తుంటూ....త్వరలోనే విజయ్ .....తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న `నోటా`కు కూడా తమిళనాట గ్రాండ్ ఓపెనింగ్స్ ఖాయమని చెప్పవచ్చు.