Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో ర‌ష్మికకే అనుభ‌వం ఎక్కువ‌ట‌!

By:  Tupaki Desk   |   16 Aug 2018 5:23 PM GMT
ఆ విష‌యంలో ర‌ష్మికకే అనుభ‌వం ఎక్కువ‌ట‌!
X
విజయ్ దేవరకొండ - రష్మిక మందన‌ల కాంబోలో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన 'గీత గోవిందం` మొద‌టి షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లోనూ మంచి క‌లెక్ష‌న్లు రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో రేప‌టి వ‌ర‌కు బిజీగా ఉండే గోవిందం....వీకెండ్ లోనూ హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్లు రాబ‌డ‌తాడ‌ని ట్రేడ్ టాక్. ఇక అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ క్యారెక్ట‌ర్ నుంచి ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు రీచ్ అయ్యే గోవిందం క్యారెక్ట‌ర్ లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. విజ‌య్ - ర‌ష్మిక ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ కావ‌డంతో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విజ‌య్ ...ర‌ష్మిక గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించాడు. ర‌ష్మిక‌కు తాళి క‌ట్టే స‌న్నివేశంలో తాను టెన్ష‌న్ పడ్డాన‌ని - కానీ ర‌ష్మిక త‌న‌కు ధైర్యం చెప్పి ఆ సీన్ పూర్తి చేయించింద‌ని అన్నాడు.

‘గీత గోవిందం' మూవీలో మొద‌టి సారిగా తాను ఓ పెళ్లి సీన్ లో తాళి క‌ట్టాన‌ని అన్నాడు. అచ్చు రియ‌ల్ పెళ్లి మండపంలా సెట్ వేశార‌ని - కానీ మూడు ముళ్లు కట్టే షాట్ చేసేపుడు తాను టెన్ష‌న్ ప‌డ్డాన‌ని అన్నాడు. షూటింగ్ అని త‌న‌కు తెలిసినా....వణికిపోయానని అన్నాడు. డైరెక్ట‌ర్ తాళి క‌ట్ట‌మ‌న‌గానే...హీరోయిన్ తో ఏదో తేడా చేస్తున్నాన‌నిపించిందన్నాడు. త‌న జీవితంలో తొలిసారి మూడు ముళ్లు వేయ‌బోయే స‌రికి ఇబ్బందిప‌డ్డాన‌ని అన్నాడు. అయితే, అప్ప‌టికే ర‌ష్మిక మూడు పెళ్లి సీన్ల‌లో న‌టించింద‌ని,....అందుకే ఆమె చాలా తేలిగ్గా చేసేసిందని అన్నాడు. ఇట్స్ ఓకే ....ఏం ప‌ర్లేదు అని ర‌ష్మిక అన‌డంతో దైర్యం తెచ్చుకుని ఆ సీన్ పూర్తి చేశాన‌ని చెప్పాడు. గీత పాత్రలో ర‌ష్మిక బాగా న‌టించింద‌ని అందుకే సినిమా హిట్ అయింద‌ని చెప్పాడు.