Begin typing your search above and press return to search.

అమాంతం పెరిగిన విజ‌య్ మార్కెట్!

By:  Tupaki Desk   |   16 Aug 2018 10:44 AM GMT
అమాంతం పెరిగిన విజ‌య్ మార్కెట్!
X
క‌ల్ట్ క్లాసిక్ `అర్జున్ రెడ్డి`తో టాలీవుడ్లో న‌యా స్టార్ గా అవ‌త‌రించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌....తాజాగా `గీత గోవిందం` హిట్ తో న‌యా సూప‌ర్ స్టార్ గా అవ‌త‌రించాడ‌న‌డంలో ఎటువంటి సందేహం లేద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అర్జున్ రెడ్డికి ఓవ‌ర్ నైట్ లో వ‌చ్చిన స్టార్ డ‌మ్ గాలివాటం కాద‌ని.....తాజాగా `గీత గోవిందం` అడ్వాన్స్ ఓపెనింగ్స్ - ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్స్ చెబుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ నూ మెప్పినంచిన విజ‌య్ గోవిందం న‌ట‌న‌కు బాక్సాఫీస్ షేక‌వుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు దాదాపు 10 కోట్ల షేర్ ను వసూలు చేసిందని ట్రేడ్ టాక్. దీనిని బ‌ట్టి విజ‌య్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కేవ‌లం త‌న క‌రిష్మాతో విజ‌య్...ఈ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ రావ‌డంలో కీ రోల్ ప్లే చేశాడు. తాజా హిట్ లో విజ‌య్ మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో, విజ‌య్ త‌ర్వాతి చిత్రం `డియ‌ర్ కామ్రెడ్` బ‌డ్జెట్ ను పెంచాల‌ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఒక హీరోకి వ‌రుస‌గా రెండు మూడు సినిమాలు ప్లాప్ అయితే....ఆ ప్ర‌భావం అత‌డి త‌ర్వాతి సినిమాల మీద ప‌డుతుంది. `సాక్ష్యం` త‌ర్వాత‌ బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌ర్వాతి సినిమా బ‌డ్జెట్ త‌గ్గించారంటూ పుకార్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, వ‌రుస హిట్ ల‌తో విజ‌య్ ...త‌న త‌ర్వాతి సినిమా బ‌డ్జెట్ల‌ను పెంచేస్తున్నాడ‌ని టాక్ వ‌స్తోంది. `గీత గోవిందం`తో విజ‌య్ మార్కెట్ పెరిగింది. దీంతో, డియ‌ర్ కామ్రెడ్ కు బ‌డ్జెట్ - నిర్మాణ విలువ‌లు పెంచాల‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ముందుగా అనుకున్న 15 కోట్ల బ‌డ్జెట్ కు మించి పెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. భ‌ర‌త్ కొమ్ము అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం కూడా గీత గోవిందం త‌రహాలో కాకినాడ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోందట‌.