కాసనోవా అవతారంలో రౌడీ హీరో

Sat Jan 12 2019 23:00:02 GMT+0530 (IST)

విజయ్ దేవరకొండ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా పూర్తి కాగానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తన నెక్స్ట సినిమా చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.  ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల డిలే అయింది. మరో రెండు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారట.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ ఒక ప్లేబాయ్ లా ఉండే పాత్రలో నటిస్తున్నాడట.  విజయ్ తన కెరీర్లో ఇలాంటి పాత్ర పోషించడం మొదటిసారి. ఇలా ప్లేబాయ్ గా ముగ్గురు హీరోయిన్లు రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా లతో రొమాన్స్ చేస్తాడట.  'అర్జున్ రెడ్డి' లో  విజయ్ రొమాన్స్ షేడ్ ను ప్రేక్షకులు ఆల్రెడీ చూశారు కాబట్టి ఈసారి ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా చూడొచ్చన్నమాట.

విజయ్ ఎంపిక చేసుకుంటున్న అన్ని సినిమాలు ఒక మోడరన్ టచ్ తో ట్రెండీగా ఉంటాయి. ఈ సినిమా కథ కూడా అలా యంగ్ జనరేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందట.  దర్శకుడు క్రాంతి మాధవ్ తో 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి అభిరుచి కల సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.