Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఉద్యమబాటలో గీతగోవిందం జంట

By:  Tupaki Desk   |   17 Dec 2018 7:47 AM GMT
ఫోటో స్టొరీ: ఉద్యమబాటలో గీతగోవిందం జంట
X
'గీత గోవిందం' తో ప్రేక్షకులను మాయ చేసిన విజయ్ దేవరకొండ - రష్మిక జోడీ మరోసారి 'డియర్ కామ్రేడ్' సినిమాలో కలిసి నటిస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిసాడు. ఇక రష్మికకూడా విజయ్ తరహాలోనే విప్లవం.. విప్లవం అంటోంది.

ఈమధ్య గూగుల్ లో మోస్ట్ సెర్చ్డ్ సౌత్ హీరోయిన్ గా నిలవడంతో రష్మిక ను విజయ్ అభినందించాడు. పనిలో పనిగా ఓ పార్టీ అడిగాడు. కానీ 'డియర్ కామ్రేడ్' నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇలా ట్వీట్ చేశారు.. 'ఆగండి ఆగండి.. పార్టీ ఇవ్వాల్సింది మేము. మీరు ఒక నెల నుండి ఇంటికి దూరంగా చాలా కష్టపడుతున్నారు.. అవుట్ పుట్ మాకెంతో నచ్చింది. ట్రీట్ మాత్రం మాదే." ఫైనల్ గా మైత్రీ వారు ఇస్తామన్న పార్టీకి విజయ్ సరే అన్నాడు.

ఇక రెండు ఫోటోలలో ఇద్దరూ తమ కుడి చేతులు పైకెత్తి పిడికిలి బిగించి పోరాటం చేస్తున్నారు. మరి విద్యార్థులకు ఇలాంటి అవసరం ఏమొచ్చిందనే విషయం మాత్రం సినిమా రిలీజ్ తర్వాతే మనకు తెలుస్తుంది. ఈ సినిమా క్యాప్షన్ 'ఫైట్ ఫర్ వాట్ యూ లవ్' మరి విద్యార్థులు తమకు ఇష్టమైన వాటిగురించి పోరాడుతున్నరన్నమాట. ఈ పోరాటసన్నివేశాల చిత్రీకరణ ఇప్పుడు కాకినాడలో జరుగుతోంది.