మణిరత్నం సినిమాలో విజయ్ దేవరకొండ?

Mon Sep 25 2017 06:00:01 GMT+0530 (IST)

చూస్తూ ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు టైం బాగానే కలిసొస్తున్నట్టుంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన విజయ్ దేవరకొండకు స్టార్ హీరోకు సరిపడా ఇమేజ్ తీసుకొచ్చింది అర్జున్ రెడ్డి. వివాదాలు ఎన్నో ఈ సినిమాను చుట్టుముట్టినా యూత్ బాగా కనెక్టవడంతో సూపర్ హిట్టయ్యింది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. దీంతో విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాలపై క్రేజ్ పెరిగింది.ఈ తరుణంలో విజయ్ దేవరకొండకు లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేయబోయే సినిమాలో అవవకాశం వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తమిళ్ స్టార్ శింబు ఇందులో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో మిగతా పాత్రలకు ఎవరిని తీసుకుంటారనేది ఇంకా ఫైనల్ అవలేదు. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరి పేరును ఖరారు చేయలేదు. ఒక టైంలో నాని నటిస్తాడనే మాట వినిపించింది. అయితే తర్వాత దీనిపై అటు మణిరత్నం నుంచి కానీ.. ఇటు నానీ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు అదే పాత్రకు విజయ్ దేవరకొండను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.

హిట్టు - ఫ్లాపులతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమాలో ఒక్కసారైనా నటించాలని చాలామంది హీరోలు కోరుకుంటారు. విజయ్ దేవరకొండను ఈ అవకాశం తొందరగానే వరిస్తోంది. ఈ సినిమా తెలుగు - తమిళంలో ఒకేసారి విడుదలవుతుంది. అదీగాక మణిరత్నం ప్రజంట్ జనరేషన్ కు చెందిన లవ్ స్టోరీ చేయబోతున్నట్లు టాక్. ఇది అతడి కెరీర్ కు మరింత ప్లస్సయ్యే పాయింటే అవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.