Begin typing your search above and press return to search.

విజయ్ సైలెన్స్ ని బ్రేక్ చేయాలి

By:  Tupaki Desk   |   20 Sep 2018 7:04 AM GMT
విజయ్ సైలెన్స్ ని బ్రేక్ చేయాలి
X
గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ లో విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ గా భావిస్తున్న విర్గినీ ఫోటోలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వాటి తాలూకు కథనాలు ఇప్పటికే బోలెడు వచ్చేసిన నేపధ్యంలో అసలు ఆ అమ్మాయి ఎవరా అనే చర్చ ఇంకా వేడెక్కుతోంది. విజయ్ ఇంతవరకు కనీసం ట్విట్టర్ లో కూడా స్పందించలేదు. అలా అని చూసి ఉండడు అని అనుకోవడానికి లేదు. ఎవరో ఒకరు చేరవేయడం జరిగే ఉంటుంది. తాను పాడిన పాట గురించి ట్రాల్స్ గురించే అంత శ్రద్ధగా ఫాలో అయిన విజయ్ ఇంత సీరియస్ మ్యాటర్ ని తెలుసుకోకుండా ఉంటాడా. సో మౌనం వ్యూహాత్మకంగానే అనుకోవచ్చు. ఇక ఆ భామ గతంలో పెళ్లి చూపులు సినిమాలో ఒక్క చిన్న సీన్ లో కనిపించిన పోరే అని మరొకొందరు పోలికలు కూడా చెప్పేసారు. ఎన్నడూ లేనిది ఈ యూరోపియన్ భామ ఇప్పటికిప్పుడు వెలుగులోకి రావడానికి కారణం వైరల్ అవుతున్న పిక్స్ అనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ మీడియా కంపెనీకి ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తోంది. వివిధ దేశాల్లో అంతర్జాతీయ సినిమాలను విడుదల చేసేందుకు అనువుగా డబ్బింగ్ మరియు నిర్మాణాంతర కార్యక్రమాలకు సాయం అందించే సంస్థ ఇది. భాగ్యనగరాన్ని విపరీతంగా ప్రేమించే ఈ అమ్మడు తనను తాను వైట్ హైదరాబాదీ అని పిలిపించుకోవడం ఇష్టమట. ఏ కారణంతో అనే కోణంలో విశ్లేషిస్తున్న వారు లేకపోలేదు. మొత్తానికి టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఈ గిన్ని(తన ముద్దు పేరట) గురించి విజయ్ దేవరకొండ ఏమైనా మాట్లాడతాడో లేక స్నేహాన్ని ఇలా అపార్థం చేసుకుంటారా అంటాడో వేచి చూడాలి. ఇక్కడ ఇది ఇంత రచ్చ కావడనికి కారణం ఒక్కటే. విజయ్ దేవరకొండ ఇంత చనువుగా గతంలో ఏ అమ్మాయితో ఉన్నట్టు ఫోటోలు బయటికి రాకపోవడమే. దానికి ఐ=విజయ్ ఫ్యామిలీతో ఉన్న పిక్స్ బయటికి రావడం. మరి ఈ సైలెన్స్ బ్రేక్ చేయాలంటే విజయ్ మౌనాన్ని వీడాల్సిందే.