Begin typing your search above and press return to search.

ఏంటి గోవిందా ఇది : ఫారిన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ తో..

By:  Tupaki Desk   |   17 Sep 2018 9:37 AM GMT
ఏంటి గోవిందా ఇది : ఫారిన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ తో..
X
‘పెళ్లి చూపులు’ - ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌ హీరో అయ్యాడు. ఈయన గురించి ప్రతి ఒక్క విషయం కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంది. విజయ్‌ దేవరకొండ ఏం చేసినా కూడా అందరు ఆయన వైపు చూస్తూ ఉంటారు. స్టార్‌ స్టేటస్‌ ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఒక ఫారిన్‌ అమ్మాయితో చాలా క్లోజ్‌ గా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆమెతో చాలా క్లోజ్‌ గా - ఏకంగా ముద్దు పెడుతూ ఆ ఫొటోల్లో విజయ్‌ ఉండటంతో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం జరిగింది. అయితే ఆ ఫొటోలు ఇప్పటివి కావని - విజయ్‌ హీరోగా క్రేజ్‌ దక్కించుకోక ముందు కొన్ని ఫొటో షూట్‌ లకు హాజరు అయ్యాడు. ఆ షూట్స్‌ కు సంబంధించినవి అంటూ విజయ్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఆ విషయం ఎంత వరకు నిజమో కాని జనాలు మాత్రం ప్రస్తుతం ఈ ఫొటోలను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫొటోలో ఉన్న ఫారిన్‌ గర్ల్‌ ఎవరై ఉంటారు అంటూ చర్చించుకుంటున్నారు. సినిమాలతో చాలా బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రం గురించి స్పందించేంతగా తీరికగా లేడు.

ఆ ఫొటోల విషయం పక్కన పెడితే విజయ్‌ దేవరకొండ దసరా కానుకగా ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్‌ సీఎంగా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విజయ్‌ దేవరకొండకు మరో విజయాన్ని ఇస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. మరో వైపు డియర్‌ కామ్రెడ్‌ చిత్రంతో కూడా విజయ్‌ బిజీగా ఉన్నాడు.