Begin typing your search above and press return to search.

మనసుని తాకిన తమిళ సినిమా ఇదే..

By:  Tupaki Desk   |   16 Jan 2018 10:41 AM GMT
మనసుని తాకిన తమిళ సినిమా ఇదే..
X
ఒక సినిమా హిట్ అయ్యింది అంటే చుసిన ప్రజలు మాత్రమే కాదు సెలెబ్రిటీలు కూడా సినిమా ను మెచ్చుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. మన తెలుగు హీరోలు ఇప్పుడు తెలుగు సినిమాలనే కాకుండా తమిళ సినిమాలను కూడా తెగ పొగిడేస్తున్నారు. అందులో మొదటగా మనం చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ అదేనండి మన అర్జున్ రెడ్డి గురించి.

2017 లో విడుదలైన అరువి అనే తమిళ చిత్రం అక్కడ చాలా పెద్ద హిట్ అయినా విషయం అందరికి తెలిసిందే. అక్కడి స్టార్ హీరోలు మరియు దర్శకులు కూడా ఆ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ సినిమా విడుదలైన కొన్ని నెలలలోనే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చెయ్యగా తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. అరువి మన తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాక విజయ్ దేవరకొండ ను కూడా మెప్పించింది. ఈ విషయం విజయ్ స్వయంగా తెలిపాడు. "అరువి :) నా మనసుని తాకింది. టీం మొత్తానికి నేను వంగి నమస్కరిస్తున్నాను." అంటూ తన సోషల్ మీడియా పేజీ లో చెప్పుకొచ్చాడు విజయ్.

అరువి రిలీజ్ తర్వాత అందులో నటించిన అదితి బాలన్ కూడా కోలీవుడ్ లో స్టార్ అయిపోయింది. ఇటువంటి సినిమాలు తెలుగులో కూడా వస్తే బాగుంటుంది. కాకపోతే డైరక్టుగా హీరోయిన్ కు ఎయిడ్స్ ఉంది అనే కాన్సెప్టుతో మనోళ్ళు సినిమాలను తీయాలంటే.. అబ్బే కమర్షియల్ అండ్ మసాలా యాంగిల్ మిస్సవుతుంది అని ఫీలవుతారు. ఒక్కసారి అరువి చూసిరండి సామీ.. అలాంటివి మన దగ్గర కూడా వస్తే బాగుంటుంది.