అర్జున్ రెడ్డికి కండలు పెరిగాయే

Sun Apr 15 2018 16:06:45 GMT+0530 (IST)

ఏడాది ముందు వరకు జస్ట్ ఒక అప్ కమింగ్ హీరోగానే పరిచయమున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి దెబ్బకు ఒక్క సినిమాతో యూత్ కి స్టార్ అయిపోయాడు. గత ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన అర్జున్ రెడ్డి ఆ స్థాయి విజయం సాధించడానికి విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ పాత్ర చాలా ఉంది. తర్వాత సినిమాకు చెప్పుకోదగ్గ గ్యాప్ తీసుకున్న విజయ్ కొత్త సినిమా ట్యాక్సీ వాలా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ మధ్య రిలీజ్ కాకుండా ఐదేళ్ళు  ఆగిపోయిన ఏం మంత్రం వేసావే అనే మూవీ విడుదలైంది కాని దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వస్తున్న ట్యాక్సీ వాలా మీద మాత్రం చాలా అంచనాలే ఉన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ మంచి యాక్షన్ బేస్డ్ రోల్ చేస్తున్నట్టు కనిపిస్తోంది . పోస్టర్స్ కూడా అలాగే ఉండటంతో దీని మీద ఆసక్తి పెరుగుతోంది. ఆ మధ్య వదిలిన టీజర్ లో కూడా చూచాయగా ఇదే చూపించారు.పైన చూస్తున్న పోస్టర్ లో కండలు తిరిగిన విజయ్ దేవరకొండ బాడీ చూస్తుంటే మాచో మ్యాన్ ట్యాగ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. స్టార్ హీరోల్లో కూడా ఇలాంటి సిక్స్ ప్యాకులు కామనే కాని స్టాండర్డ్ గా ఒకే రీతిగా మైంటైన్ చేస్తున్న వాళ్ళు తక్కువే. అందుకే విజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. జర్నీ నేపధ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ట్యాక్సీ వాలా మంచి హైప్ తో ఉంది. దీని కంటే ముందు విజయ్ ఫుల్ లెంగ్త్ కాకపోయినా కీలక పాత్రలో నటించిన మహానటి మే 9న విడుదల కానుంది. పది రోజులు గడవక ముందే ట్యాక్సీ వాలాగా వచ్చేస్తాడు విజయ్ దేవరకొండ. ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గురించి ఈ మధ్య ఎటువంటి అప్ డేట్స్ లేవు. ఇప్పుడొస్తున్న ట్యాక్సీ వాలా కనక హిట్ అయితే విజయ్ సెటిల్ అయ్యే విషయంలో ఇంకా ఏదైనా బాలన్స్ ఉంటె అది తీరినట్టే.