Begin typing your search above and press return to search.

కామెంట్స్ కి అర్జున్ రెడ్డి స్టైల్ ఆన్సర్

By:  Tupaki Desk   |   24 April 2018 10:34 AM GMT
కామెంట్స్ కి అర్జున్ రెడ్డి స్టైల్ ఆన్సర్
X
ఏ అంశం పై అయినా విజయ్ దేవరకొండ ఆన్సర్ ఇచ్చే విధానం సూపర్బ్ గా ఉంటుంది. ఈ జనరేషన్ యంగ్ హీరో కావడంతో పాటు.. బిహేవియర్ లో గట్స్ ఉన్నవాడు కావడంతో.. చెడామడా అనుకున్న మాటను చెప్పేయగలడు. వచ్చే నెల 11న విడుదల అవుతున్న మహానటి మూవీలో కీలక పాత్రలో నటించాడు ఈ యంగ్ హీరో.

ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. నిన్న ఓ కామెంట్ పెట్టాడు. 'వాట్ ఏ కూల్ చిక్.. మహానటి' అంటూ సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ గురించి కామెంట్ చేశాడు విజయ్. ఇది కీర్తి సురేష్ ని ఉద్దేశించినదే అయినా.. సావిత్రి లాంటి మహానటి గెటప్ లో ఉన్నపుడు.. ఇలాంటి కామెంట్ జనాలకు నచ్చలేదు. అందుకే సావిత్రిని చిక్ అంటావా అంటూ విజయ్ దేవరకొండను నిలదీయడం మొదలుపెట్టారు. కొంతమంది అయితే.. నేరుగానే తిట్టిపోశారు కూడా. కానీ దీనికి ఈ యంగ్ హీరో నుంచి వచ్చిన రిటార్ట్ అయితే.. అసలు గుక్క తిప్పుకోనివ్వని రేంజ్ లో ఉంది.

'నా నుంచి క్షమాపణ కోరుకుంటున్న ఎవరైనా సరే.. చెన్నై లీలా ప్యాలెస్ లో ఉన్న వచ్చేయండి. నేను మీకు మహానటి ఆడియో లాంఛ్ కి ఎంట్రీ పాసులు కూడా ఇస్తాను. మీరంతా అప్పుడు ఉండి ఉంటే ఆమె చాలా సంతోషించేది. ఎందుకంటే అప్పుడు మీలాంటి నీతులు నియమాలు చెప్పే బ్యాచ్ ఆమెను సంసారం విచ్ఛిన్నం చేసిందని.. తాగుబోతు అని కామెంట్స్ చేశారు' అంటూ రివర్స్ లో కౌంటర్ వేసి నోళ్లు మూయించేశాడు విజయ్ దేవరకొండ.