Begin typing your search above and press return to search.

తొలిముద్దు 19లో, అయినా వ‌ర్జినే!

By:  Tupaki Desk   |   19 Oct 2018 4:17 AM GMT
తొలిముద్దు 19లో, అయినా వ‌ర్జినే!
X
అర్జున్‌ రెడ్డి సినిమాతో రౌడీగా ఇమేజ్ తెచ్చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అత‌డు ఎక్క‌డికి వెళ్లినా రౌడీ అనే పిలుస్తున్నారు. అత‌డి రౌడీ వేషాల్ని గుర్తు చేసుకుని ఫ్యాన్స్ మైమ‌రిచిపోతున్నారు. మొన్న నోటా సినిమా ఆద్యంతం ఈ రౌడీ అన్న ప‌దం ఎంతో ప్రాధాన్య‌త‌తో వినిపించింది. ప్ర‌స్తుతం రానా నిర్వ‌హిస్తున్న `నంబ‌ర్ 1 యారీ` సీజ‌న్ 2 కార్య‌క్ర‌మంలోనూ దేవ‌ర‌కొండ‌లోని రౌడీయిజాన్ని రానా బ‌య‌ట‌కు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌హ‌న‌టి ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్, దేవ‌ర‌కొండ ఇద్ద‌రిపైనా సాగిన ఎపిసోడ్‌ లో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే సంగ‌తులే బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

విజ‌య్‌ నువ్వు ఫ‌స్ట్ కిస్ ఎప్పుడు పెట్టావు? అంటూ రానా ప్ర‌శ్నించ‌గా.. ``తొలిముద్దు పెట్టుకోవ‌డానికి 19 ఏళ్ళు ప‌ట్టింద‌``ని దేవ‌ర‌కొండ స‌మాధానం ఇచ్చాడు. తొలి నుంచీ బాయ్స్ హాస్ట‌ల్‌ లో చ‌దువుకోవ‌డం వ‌ల్ల అమ్మాయిలు అంటే చాలా భ‌యం అని అస‌లు ర‌హ‌స్యం చెప్పాడు. ఇంకో ర‌కంగా చెప్పాలంటే `గీత గోవిందం` సినిమాలో బుద్ధిమంతుడు టైపు అని అత‌డు చెప్పిన దానిని బ‌ట్టి అర్థ‌మైంది. ఇంత‌కీ నువ్వు వ‌ర్జిన్‌ వేనా? అన్న ప్ర‌శ్న‌కు.. నాగ అశ్విన్ కాద‌ని అనుమానంగా త‌ల ఊప‌గా.. వెంట‌నే విజయ్ మాట్లాడుతూ ..``అలా అంద‌రి ముందు నో అని చెప్ప‌కూడ‌దు`` అంటూ పెద్ద‌ షాక్ ఇచ్చాడు. అంటే విజ‌య్ వ‌ర్జిన్ కాద‌ని అనుకునేలోగానే.. ఇప్ప‌టికీ వ‌ర్జిన్‌ నే అంటూ న‌వ్వేశాడు విజ‌య్. కార్య‌క్ర‌మం ఆద్యంతం విజ‌య్ నుండి అనేక ఆశ‌క్తిక‌ర‌మైన విష‌యాలు రాబ‌డుతూ ర‌క్తి క‌ట్టించాడు రానా.

నంబ‌ర్ 1 యారీ ప్రోగ్రామ్‌ లో దేవ‌ర‌కొండ గుట్టు మొత్తం లీకైంది. అయితే ఆ విదేశీ అమ్మాయి గుట్టు మాత్రం లీక్ చేయ‌నేలేదు. ఇంత‌కీ ఆ విదేశీ అమ్మాయి ఎవ‌రు? అని ఇదివ‌ర‌కూ `నోటా` ప్ర‌మోష‌న‌ల్‌ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించిన‌ప్పుడు..`` బావుందా.. న‌చ్చిందా.. త‌న పేరు ఎందుకులే అని ఇప్పుడు లాగ‌డం లేదు`` అన్నాడు. డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం నిన్న హైద‌రాబాద్- పార్క్ హ‌య‌త్‌ లో అతిర‌ధుల స‌మ‌క్షంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.