Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డిల కోసం ఎదురుచూస్తున్న విజయ్

By:  Tupaki Desk   |   19 Jun 2018 10:36 AM GMT
అర్జున్ రెడ్డిల కోసం ఎదురుచూస్తున్న విజయ్
X

ప్రతి నటుడి జీవితంలో ఒక బెంచ్ మార్క్ సినిమా ఉంటుంది. అలా లేకుంటే నటుడిగా ఎవరు సంతృప్తి చెందలేరు. అలాంటి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు,. ఒక్కోసారి స్టార్ హోదాను కూడా లెక్కచేయరు. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ మొదట్లోనే అలాంటి మంచి అవకాశం దక్కడంతో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు హిందీలో అర్జున్ రెడ్డి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఒరిజినల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా అందరికంటే ఎక్కువగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. బాలీవుడ్ లో డిఫెరెంట్ సినిమాలు ఉంటాయి. అందులో అర్జున్ రెడ్డి మరింత డిఫెరెంట్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డిగా ఎలా చేస్తాడు అనే ఊహ చాలా ఆసక్తిని రేపుతోందని అన్నాడు.

అలాగే తమిళ్ లో కూడా బాలా దర్శకత్వంలో విక్రమ్ కుమారుడు ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అది కూడా కొత్తగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక హిందీలో సందీప్ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమాలో అసలైన తెలుగు మజా కనిపిస్తుందని అయినా కూడా షాహిద్ ఎలా చేస్తాడో చూడాలని విజయ్ ఆశపడుతున్నారు. మరి విజయ్ అంచనాలకు తగ్గట్టుగా రీమేక్ సినిమాలు ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.