Begin typing your search above and press return to search.

సీనియర్ భామ‌తో విజయ్ దేవ‌ర‌కొండ‌

By:  Tupaki Desk   |   16 July 2018 6:26 AM GMT
సీనియర్ భామ‌తో విజయ్ దేవ‌ర‌కొండ‌
X
ప‌న్నెండేళ్లుగా తెలుగు తెర‌పై సంద‌డి చేస్తున్న క‌థానాయిక కాజ‌ల్‌. ఆమెతో పోలిస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా జూనియ‌ర్‌. కానీ ఈ ఇద్ద‌రూ క‌లిసి త్వ‌రలోనే జోడీ కట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఓన‌మాలు - మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల‌తో మంచి ద‌ర్శ‌కుడు అనిపించుకొన్న క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్‌ - కాజ‌ల్ జంట క‌లిసి న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. క‌థ‌ల ఎంపిక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మంచి టేస్ట్ ఉంద‌నే విష‌యం పెళ్లిచూపులు - అర్జున్‌ రెడ్డి వంటి చిత్రాల‌తో రుజువైంది. త‌దుప‌రి ఆయ‌న గీత గోవిందం - టాక్సీవాలా చిత్రాల‌తో సంద‌డి చేయ‌బోతున్నాడు. ఆల్మోస్ట్ ఈ సినిమాల షూటింగ్ కూడా పూర్త‌యింది.

ఇక తదుప‌రి విజ‌య్ న‌టించే చిత్రం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలోనే అని తెలుస్తోంది. క్రాంతి మాధ‌వ్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నాయ‌కానాయిక‌లిద్ద‌రూ వెంట‌నే ఓకే చేశార‌ట‌. ఈ సినిమాలో కాజ‌ల్‌ని ఎంపిక చేసుకోవ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం కూడా ఉన్న‌ట్టు తెలిసింది. మ‌రి అదెందుకనేది సినిమా ఆరంభ‌మ‌య్యాకే తెలిసే అవ‌కాశం ఉంది. కానీ ఈ కాంబో మాత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు స‌మాచారం. క్రాంతిమాధ‌వ్ ఇదివ‌ర‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు తీసింది కూడా ఈ సంస్థ‌లోనే.