Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్‌: ట్యాక్సీలో దెయ్యం

By:  Tupaki Desk   |   12 Nov 2018 3:44 AM GMT
ట్రైల‌ర్‌: ట్యాక్సీలో దెయ్యం
X
విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. గీత గోవిందం లాంటి సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత దేవ‌ర‌కొండ‌కు ఊహించ‌ని ట్విస్టు ఇది. అయినా అత‌డిలో కాన్ఫిడెన్స్ లెవ‌ల్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. అప్ప‌టికే ఆన్‌ లైన్‌ లో లీకైనా.. ట్యాక్సీవాలా సినిమాని ఎవ‌రూ పూర్తిగా చూడ‌లేదు.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ లో చాలా చేశాం.. అంటూ ఇటీవ‌లే వీడియో ప్రూఫ్‌ ని లైవ్‌ లోకి తెచ్చి తెలివైన ప్ర‌చారం చేసుకున్నాడు దేవ‌ర‌కొండ‌. నిన్న‌టి రేయి హైద‌రాబాద్ జేఆర్‌ సీలో జ‌రిగిన ఈవెంట్‌ లో ట్యాక్సీవాలా ట్రైల‌ర్‌ ని ముఖ్య అతిధి అల్లు అర్జున్‌ ఆవిష్క‌రించాడు.

అస‌లింత‌కీ ఈ ట్రైల‌ర్ ఎలా ఉంది? అన్న‌ది చూస్తే.. ట్రైల‌ర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గానే ఉంది. కామెడీ- హార‌ర్ మిక్స్ చేసి అల్లుకున్న క‌థాంశ‌మిది. `ట్యాక్సీవాలా` జీవితంలో ఊహించ‌ని స‌న్నివేశం ఏంటి? అత‌డు న‌డిపించే ట్యాక్సీలో దెయ్యం కథేంటి? అన్న‌ది ట్రైల‌ర్‌ లో రివీల్ చేసేశారు. దీనిని బ‌ట్టి ఇన్నాళ్లు హార‌ర్ కామెడీ క‌థ‌ల‌న్నీ ఏదైనా బూత్ బంగ్లా చుట్టూ తిరిగేవి. వాట‌న్నిటికీ డిఫ‌రెంట్‌గా ఈసారి హార‌ర్ టెర్ర‌ర్ ట్యాక్సీలోకి షిఫ్ట‌యింది అని అంద‌రికీ అర్థ‌మయ్యేలా చెప్పింది ఈ ట్రైల‌ర్.

దేవ‌ర‌కొండ - ట్యాక్సీలో దెయ్యం ఎపిసోడ్స్ ఉత్కంఠ పెంచినా మ‌ళ్లీ బ్యాచిల‌ర్ రూమ్.. ఉద్యోగాల కోసం వెతుక్కోవ‌డం.. అందులోంచి పుట్టుకొచ్చే కామెడీ ఇవ‌న్నీ రొటీన్‌ గానే అనిపించాయి. ఇప్ప‌టికైతే టాలీవుడ్‌ కి హార‌ర్ సినిమాల‌కు కొద‌వేం లేదు. హార‌ర్ కామెడీలెన్నో వ‌చ్చి జ‌నాల‌కు మొహం మొత్తేసేలా చేశాయి. ఇప్పుడు ట్యాక్సీవాలా కూడా అదే గుంపులో క‌ల‌వ‌క‌పోతే ఓకే. ఈ సినిమాలో సంథింగ్ స్పెష‌ల్ ఉంది అనిపిస్తేనే జ‌నం థియేట‌ర్ల వైపు వ‌చ్చే ఛాన్సుంది. ట్యాక్సీవాలాకి మినీబాహుబ‌లి అంత సీజీ వ‌ర్క్ చేశామ‌ని దేవ‌ర‌కొండ చెబుతున్నాడు కాబ‌ట్టి, ఆ సీజీ ఎంత‌వ‌ర‌కూ క‌లిసొస్తుందో చూడాలి. రాహుల్ సాంక్రిత్యాయ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో యువి క్రియేష‌న్స్ - జీఏ2 (ఎస్‌ కెఎన్‌) సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈనెల 17న సినిమా రిలీజ‌వుతోంది.