ట్యాక్సీ వాలా రిలీజ్ డేట్ ఫిక్స్

Fri Feb 23 2018 14:08:35 GMT+0530 (IST)

అర్జున్ రెడ్డితో తన ఇమేజ్ ని పదింతలు పెంచేసుకున్న విజయ్ దేవరకొండ డిమాండ్ మామూలుగా లేదు. పెళ్లి చూపులు సినిమా పెద్ద హిట్టే అయినప్పటికీ దానికి హీరో కన్నా దర్శకుడికే ఎక్కువ పేరు వచ్చింది. ఆ కొరతను పూర్తిగా తీరుస్తూ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడం విజయ్ దేవరకొండ కెరీర్ కు పెద్ద బూస్ట్ ఇచ్చింది. దీని తర్వాత సినిమాలు చేసే విషయంలో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'టాక్సీ వాలా' విడుదలకు సిద్ధంగా. యూనిట్ నుంచి అందిన ప్రత్యేక సమాచారం మేరకు దీనికి రిలీజ్ డేట్ మే 18 ఫిక్స్ చేసారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుంది.రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జర్నీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే థ్రిల్లర్ మూవీ గా ఉండబోతోందని టాక్. రాహుల్ గతంలో ది ఎండ్ అనే సినిమాకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలను అందుకునేలా చాలా విభిన్నంగా దీన్ని తెరకెక్కించినట్టు చెబుతున్నాడు రాహుల్. మే 18న గోపిచంద్ పంతం కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. నిర్మాతలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండ పరశురాం దర్శకత్వంలో మరో సినిమా చేస్తుండగా స్పెషల్ క్యామియో చేస్తున్న మహానటి సమ్మర్ లో విడుదల కానుంది. మొత్తంగా విజయ్ దేవరకొండ సినిమాలు ఈ ఏడాది మూడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గా మెప్పించిన విజయ్ ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ గా ఎలా చేసాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.