రానా కు 15 అయితే విజయ్ కి 30

Sat Sep 23 2017 13:04:47 GMT+0530 (IST)

ఈ రోజుల్లో సినిమాలు హీరోలకు ఎంత లాభాన్ని ఇస్తున్నాయో అదే తరహాలో యాడ్స్ కూడా అంతే లాభాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ తారలు ఎక్కువగా యాడ్స్ రూపంలో చాలా రెమ్యూనరేషన్ ను అందుకునేవారు. కానీ ఇప్పుడు సౌత్ లో కూడా సెలబ్రెటీలు చాలా వరకు యాడ్స్ తో బాగానే సంపాదిస్తున్నారు. కంపెనీలు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా తారలకు అడిగినంత ఇస్తూ.. ప్రచారాల్ని నిర్వహిస్తున్నారు.అయితే రీసెంట్ గా రానా ఓ ప్రముఖ షాపింగ్ మాల్ రిబ్బన్ కటింగ్ కి 15 లక్షలు తీసుకున్నాడంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక వార్తను ప్రచురించింది. అక్కడ రానా 15 నిమిషాలు కూడా ఉండలేదు. కేవలం 10 నిమిషాలు ఉండి వెళ్లిపోయినందుకు 15 లక్షలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు అతనికంటే కంటే ఎక్కువగా విజయ్ దేవరకొండ 30 లక్షలు తీసుకొని ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడట. అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం కాకుండా మాంచి ఫాలోయింగ్ ని అందుకున్నాడు.  దీంతో మనోడికి మంచి సినిమా ఆఫర్స్ రావడమే కాకుండా ఇలా యాడ్స్ రూపంలో కూడా మంచి రెమ్యునరేషన్స్ అందుతున్నాయంట.

అయితే విజయ్ ఒక్క సినిమాతో రానా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ను అందుకోవడం చూస్తుంటే.. రానా విజయ్ కంటే అంత తక్కువనా ? అనే కామెంట్స్ వినబడుతున్నాయి.  కాని వాస్తవం ఏంటంటే.. రానా కేవలం 10 నిమిషాలకు 15 లక్షలు తీసుకుంటే.. విజయ్ దేవరకొండ ఒక సంవత్సరంపాటు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి 30 లక్షలు తీసుకున్నాడు. సో చాలా తేడా ఉంది సుమీ.