Begin typing your search above and press return to search.

బహుశా.. అందుకోసమేనా?

By:  Tupaki Desk   |   10 Dec 2017 1:30 AM GMT
బహుశా.. అందుకోసమేనా?
X
సోషల్ మీడియాలో తారలు ఈ మధ్య కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఏ మాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ.. ఫన్నీ రూమర్స్ కి బూస్ట్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి అనుమానాలు కథనాలు వెలువడుతాయో అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని న్యూస్ ని చూసి నవ్వుకుంటున్నారు. ఈ తరహాలో చాలా మంది తారలు సరదాగా చేస్తుంటారు. అయితే ఇప్పుడు అదే తరహాలో అర్జున్ రెడ్డి హీరో కూడా చేస్తున్నాడా అనిపిస్తోంది.

ఎందుకంటే గత ఉదయం మెహ్రీన్ పిర్జాదతో సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు. కాని ఎందుకో చెప్పలేదు. అంతే కాకుండా వారిద్దరు హోలీ ఆడినట్టు ఉండడం చూసి ఏదైనా వేడుకలో పాల్గొన్నారా లేక షూటింగ్ చేశారా అని కామెంట్స్ వినిపించాయి. ఇక ఆ సంగతి పక్కనపెడితే ఈ సారి విజయ్ ఫ్రెమ్ లోకి దర్శకుడైన వంశీ పైడిపల్లిని కూడా తీసుకువచ్చాడు. వారితో పాటు మెర్సల్ సినిమాటోగ్రాఫర్ జీకె.విష్ణు అండ్ ప్రముఖ పాన్ ఇండియన్ డాన్స్ డైరెక్టర్ లలిత శోభి కూడా ఫొటోలో కనిపించారు.

వీరు ఏం చేస్తున్నారు అనే విషయంలోకి వెళితే.. ఒక అనుమానం మాత్రం నిజం అయ్యేలా ఉందనిపిస్తోంది. ఈ నెల డిసెంబర్ 15న హైదరాబాద్ లో తెలుగు మహాసభలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే కొంత మంది దర్శకులు వారి టాలెంట్ ను ఉపయోగించి అక్కడ ప్రదర్శించడానికి సాంగ్స్ ని వారి స్టైల్లో చిత్రీకరించడానికి డిసైడ్ అయ్యారు. అందులో వంశీ పైడిపల్లి కూడా ఉన్నందుకు.. బహుశా ఆ సాంగ్ కోసం వీరు ఒకటయ్యారా? అనే సందేహం కలుగుతోంది.