Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డితో సెల్ఫీ ఎందుకో?

By:  Tupaki Desk   |   9 Dec 2017 9:55 AM GMT
అర్జున్ రెడ్డితో సెల్ఫీ ఎందుకో?
X
తెలుగు సినిమాకు సరికొత్త పాఠాలనునేర్పిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతగా సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్ర కథానాయుడు విజయ్ సాయి దేవరకొండ ఇమేజ్ ఒక్కసారిగా పెరగడంతో అతని నెక్స్ట్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం మనోడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఎవరు ఊహించని విధంగా అర్జున్ రెడ్డి హీరో ఒక హీరోయిన్ తో స్టిల్ ఇచ్చాడు.

దీంతో విజయ్ ఆమెతో నటిస్తున్నాడా లేక ఎక్కడైనా వేడుకల్లో ఇలా స్పెషల్ గా స్టీల్ ఇచ్చారా అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె కొత్త హీరోయిన్ అయితే పరవాలేదు కానీ కొన్ని సినిమాలను చేసిన హీరోయిన్ అయ్యేసరికి క్లారిటీ రావడం లేదు. మహానుభావుడు - రాజా ది గ్రేట్ సినిమాలతో ఈ ఏడాది వరుస హిట్స్ అందుకున్న మెహ్రీన్ పిర్జాదా - విజయ్ తో హోలీ జరుపుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. కానీ అందులో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. అయితే మెహ్రీన్ తో దిగిన సెల్ఫీ ఎక్కడిదబ్బా అనే కన్ఫ్యూజన్ లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బహుశా పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోందా లేక రాహుల్ సినిమాలోని హీరోయినా అనే అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి. మరి ఈ విషయంపై సాయి ఓ క్లారిటీ ఇస్తే బావుండు..